BigTV English

Tufan: ఎండాకాలంలో వానాకాలం.. తుఫాన్ కూడా.. ఇదేం పోయేకాలం?

Tufan: ఎండాకాలంలో వానాకాలం.. తుఫాన్ కూడా.. ఇదేం పోయేకాలం?


Tufan: మండుటెండల్లోనూ వానలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకే రైతులు ఎంతో నష్టపోయారు. ఇప్పుడు తుఫాన్ రూపంలో మరోసారి ముప్పు పొంచి ఉంది. రాగల మూడు రోజుల్లో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారుతోంది. ఇది తుఫానుగా మారనుంది. దానికి మోకా తుఫాన్‌గా ఇప్పటికే పేరు పెట్టారు. దీని ప్రభావంతో రాబోయే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


అంతేకాదు.. దక్షిణ కర్ణాటకను ఆనుకొని తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. మోకా తుఫాన్ ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ భావిస్తోంది. ఈ తుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని తెలిపింది.

అల్పపీడనం నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. వేటకు వెళ్లిన వారు శనివారం సాయంత్రంలోగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×