BigTV English

Vijayawada Politics: రసవత్తరంగా బెజవాడ రాజకీయం.. టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్

Vijayawada Politics: రసవత్తరంగా బెజవాడ రాజకీయం.. టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్
Andhra pradesh political news today

Vijayawada Politics(Andhra pradesh political news today):

బెజవాడ రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ వర్సెస్ నాని ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. నాని మావాడని టీడీపీ చెబుతుంటే.. పార్టీ నన్ను వద్దనుకుంటుందని కేసినేని అంటున్నారు. అయితే.. ఇదంతా ఓ గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతోందని చర్చ నడుస్తోంది.


బెజవాడ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అంతకు మించి అనేలా రోజూ మరింత హీట్‌ను పెంచుతున్నాయి. తిరువూరు కేంద్రంగా మొదలైన టీడీపీలో అంతర్గత పోరు.. అదే తిరువూరులో మరో టర్న్ తీసుకున్నాయి. అటు కేశినేని నాని.. ఇటు టీడీపీ మైండ్‌గేమ్‌కు తెరలేపాయి.

తిరువూరు సభ ఏర్పాట్లలో కేశినేని బద్రర్స్ మధ్య ఉన్న కోల్డ్ వార్ బయటపడింది. ఈ ఏర్పాట్లకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించిందని కేశినేని నాని ట్వీట్ చేయడంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాతే అధినేతకు తన అవసరం లేనపుడు పార్టీలో ఉండటం వృధా అని మరో ట్వీట్ చేశారు నాని. ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే పార్టీకి కూడా గుడ్ బై చెబుతానని ప్రకటించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. చంద్రబాబు తిరువూరు సభలో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది.


పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ప్రకటించినప్పటికీ.. నాని మాత్రం మావాడేనని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే.. చంద్రబాబు సభలో కేశినేని కోసం ఓ కుర్చీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు.. శనివారం ఎంపీ కనకమేడల కేశినేని ఇంటికి వెళ్లి మాట్లాడారు. కుర్చీ వేయడం.. కనకమేడలను రాజీ కోసం పంపించడంతో.. పార్టీలో కేశినేని ప్రయారిటీ తగ్గేలేదని టీడీపీ అధిష్టానం క్యార్డర్ కు సందేశం పంపించింది.

ఇంత జరిగిన తర్వాత కూడా కేశినేని పార్టీకి రాజీనామా చేసినా.. ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించినప్పటికీ పార్టీని వీడారని టీడీపీ ప్రచారం చేయడానికి సిద్దమవుతోందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన మైండ్‌గేమ్‌తో నానిపై సింపతీ క్రియేట్ కాకుండా టీడీపీ జాగ్రత్త పడుతోందని చర్చ నడుస్తోంది. పార్టీ యాంగిల్ ఇలా ఉంటే.. నాని కూడా దానికి కౌంటర్ గేమ్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అధినేత వద్దనుకున్నారు కాబట్టే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనని తొలి నుంచి కేశినేని చెబుతున్నారు. చంద్రబాబుపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే తన అవసరం లేనపుడు పార్టీలో ఉండటం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పార్టీపై, చంద్రబాబుపై కానీ ఎక్కడా విమర్శలు చేయడం లేదు.
అంటే.. పార్టీకి తాను సిన్సియర్ కార్యకర్తను అని చెప్పకనే చెప్పకుంటున్నారు. ఇలా చేస్తే రేపటి రోజున పార్టీ క్యార్డర్ ఎంతో కొంత తనతో ఉంటుందని నాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకటించిన తర్వాత రాజీనామా చేయకుండా నాన్చడానికి కూడా కారణమిదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×