BigTV English

Tdp Leaders Incident: భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య

Tdp Leaders Incident: భగ్గుమన్న పాతకక్షలు.. ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య

Tdp Leaders Incident: పల్నాడు జిల్లాలో పాతకక్షలు మరోసారి హత్య రాజకీయాలకు తెరలేపాయి. జంట హత్యలతో పల్నాడు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాతకక్షలతో, ఆధిపత్య పోరుతో పల్నాడు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కనుమరుగవుతోంది. ఆధిపత్య పోరు వల్ల రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. మరో సారి జంట హత్యతో మాచర్ల నియోజక వర్గంలో రాజకీయాలు భగ్గుమన్నాయి. మాచర్ల నియోజక వర్గంలోని ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు.


వెల్దుర్తి మండలం గుండపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, సోదరుడు కోటేశ్వరరావు దారుణ రాజకీయ హత్యకు బలయ్యారు. టీడీపీ పార్టీకి చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు గుండ్లపాడు నుంచి బైక్‌పై వెళ్తుండగా.. స్కార్పియో వాహనంతో వచ్చి ఢీ కొట్టారు దుండగులు. కింద పడిపడిన ఇద్దరిపై వేట కొడవల్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు టీడీపీ కార్యకర్తలు.

టీడీపీ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. మళ్లీ అదే గ్రామానికి చెందిన ఇద్దరు హత్యకు గురవ్వడం పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. జంట హత్యపై ఫైర్ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. జిల్లాలో పోలీసుశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలో వైసీపీ నేతల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు వ్యక్తులు ఈహత్యలకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.


Also Read: పోలీసు వాహనాలను ఢీకొన్న లారీ.. స్పాట్‌లోనే కానిస్టేబుల్..

అయితే తమ వర్గానికి చెందిన శ్రీనుపై… వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య వర్గం దాడి చేయాన్ని తోట వెంకట్రామయ్య వర్గం జీర్ణించుకోలేకపోయింది. తమ ఆధిపత్యాన్ని ముద్దయ్య సవాల్ చేయాడాన్ని తట్టులేకపోయింది. దీంతో పక్కాగా స్కెట్ వేసింది. ఈ రోజు వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులు ఫంక్షన్‌కు  వెళ్లి వస్తుండటాన్ని అవకాశంగా మలుచుకోని దాడి చేసి హత్య చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది. రెండేళ్ల క్రితం రెండు పార్టీల మధ్య జరిగిన హత్యతో బిక్కు బిక్కు మంటూ గడిపిన పల్లెవాసులు మరోసారి భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం స్థానికలు కళ్లలో కదలాడుతోంది. ఇప్పటికైనా ఈ హత్యలకు పుల్ స్టాఫ్ పడుతుందా లేదా అన్న ప్రశ్నే అందరి నోళ్లలో నానుతోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×