Jailer 2: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కెరియర్ పతనమవుతున్న సమయంలో అనూహ్యంగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) జైలర్ (Jailer) రూపంలో ఆయనకు మంచి కం బ్యాక్ అందించారు. రజినీకాంత్ కెరియర్ లోనే జైలర్ సినిమాకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. రజనీకాంత్ కెరియర్ ముగిసింది అనుకునే సమయంలో ఈ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. దాంతో రజినీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ చేస్తున్న సందడి ఇప్పుడు అంతా ఇంతా కాదని చెప్పాలి. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంటూ బిజీగా మారిపోతున్నారు. ఇకపోతే రజినీకాంత్ కి సక్సెస్ ఇచ్చిన జైలర్ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా.. ఇప్పుడు రజినీకాంత్ కూడా జైలర్ సీక్వెల్ పై ఆసక్తి కనబరచడం, అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభం కావడం.. అంతా చకచకా జరిగిపోయింది.
జైలర్ 2లో కూడా వివాదాస్పద వర్మ..
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సీక్వెల్ లో తెలుగు పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ కనిపించబోతున్నారని , 10 నిమిషాలు జైలర్ 2 లో కనిపించడం కోసం బాలకృష్ణ ఏకంగా రూ.50 కోట్ల పారితోషకం డిమాండ్ చేశారని సమాచారం. ఇకపోతే ఆయనకు ఇటీవలే పద్మభూషణ్ అవార్డు రావడం, దీనికి తోడు ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ (Kalhanidhi maran) కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఏపీలో కూడా ఈ సినిమా షూటింగ్ ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పుడు జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్, వర్మ పాత్రలో కనిపించిన వినాయకన్ (Vinayakan) మధ్య సన్నివేశాలు అత్యంత కీలకంగా మారాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
అందుకే జైలర్ 2 లో కూడా ఈయనే ఉంటే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారు. అందులో భాగంగానే కొన్ని నిమిషాల పాటు ఆయనను చూపించబోతున్నారట.
వినాయకన్ కోసం ప్రత్యేకంగా పాత్ర డిజైన్ చేసిన డైరెక్టర్..
జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్లు చూపించారు కాబట్టి సీక్వెల్ లో ఆయన పాత్ర ఉండదేమో అని అందరూ అనుకున్నారు కానీ నెల్సన్ దిలీప్ మాత్రం ఒక సీన్లో భాగంగా ఫ్లాష్ బ్యాక్ కు తీసుకువెళ్లి మరీ వర్మను మరోసారి వెండితెరపై జైలర్ 2 కోసం తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు కోలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. జైలర్ 2 లో వర్మ పాత్ర కోసం వినాయకన్ రెండు రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారట. పాత్ర డిమాండ్ చేస్తే మరో మూడు రోజులపాటు పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అసలే ఈ మధ్యకాలంలో ఎక్కువగా తాగి గొడవ చేసిన కేసులో పోలీసులు ఈయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒకసారి టీ కొట్టు వద్ద ఇంకొకసారి ఆడవారితో ఇలా గొడవ పడుతూ వివాదాస్పద వర్మగా పేరు సొంతం చేసుకున్నారు. మరి జైలర్ 2 లో కూడా ఈ వివాదాస్పద వర్మ కనిపించబోతున్నాడని తెలియడంతో ఈ తాగుబోతు కి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవసరమా అని కొంతమంది విమర్శలు చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం అది ఆయన వ్యక్తిగతం ఇలాంటి మాటలు అనవసరం.. ఆయన నటనను మాత్రమే చూడాలి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే జైలర్ 2 లో కూడా వివాదాస్పద వర్మ నటించబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Manchu Manoj: జనాల్ని పిచ్చోల్ని చేసావ్ కదయ్యా.. మనోజ్ ఏజ్ పై భారీ ట్రోల్స్..!