YS Jagan Comments: వైఎస్ జగన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. నిన్ననే అంటే బుధవారమే ఒంగోలుకు చెందిన కీలక నేత వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను జగన్ కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంపించారు. అయితే, మరోసారి కూడా జగన్ కు షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు కీలక నేతలు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వస్తున్న సమాచారం ప్రకారం.. ఇద్దరు కీలక నేతలు వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ విధానం వల్లే తాము పార్టీకి దూరమైతున్నట్లు తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం.
Also Read: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్
అయితే, తన దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాతో పార్టీకి కొంతవరకు నష్టం కలిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇటు ఆ ఇద్దరు నేతలు కూడా పార్టీని వీడితే ఖచ్చితంగా వైసీపీకి కొంత గడ్డు కాలం ఎదురైనట్టవుతుందని అనుకుంటున్నారు. వీరిని చూసి మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి రానున్న రోజులు గడ్డుకాలమేనని చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?