AP Politics : వల్లభనేని వంశీ పని అయిపోయింది. ఇంటి నుంచి జైలుకు.. జైలు నుంచి హాస్పిటల్‌కు. అందగాడిలో ఉండే వంశీ.. అందవిహీనుడిగా మారారు. ముఖంలో ముసలికళ కనిపిస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కిపోయారు. బరువు తగ్గారు. ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తింది. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నారు. విపరీతంగా దగ్గుతున్నారు. జైలు జీవితం.. ఆయన్ను శారీరకంగా, మానసికంగా మార్చేసింది. సమస్య తీవ్రంగా ఉండటంతో.. హైకోర్టు అనుమతితో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో.. పోలీసుల పహారాలో.. వంశీ మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. చేసిన పాపం అనుభవిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు అంటున్నారనుకోండి అది వేరే విషయం.
భార్యనే దిక్కు..!
టోటల్ ఎపిసోడ్‌లో వంశీకి సపోర్ట్‌గా ఆయన భార్య పంకజశ్రీ ముందున్నారు. పార్టీ అండ అంతంతమాత్రమే. వంశీని ఇంటి నుంచి పోలీసులు తీసుకెళ్లినప్పుడూ ఆమె మాట్లాడారు. జైలుకు వెళ్లే సమయంలోనూ స్పందించారు. హెల్త్ ప్రాబ్లమ్ బయటపడినప్పుడూ ఆమె చలించిపోయారు. ఇప్పుడు అర్థరాత్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లేటప్పుడూ భార్య వెంటే ఉన్నారు. హైకోర్టు సైతం వంశీకి తోడుగా వార్డులో భార్య పంకజశ్రీ ఉండేందుకు అనుమతి ఇవ్వడంతో ఆయన బాగోగులు చూసుకుంటున్నారు.
పంకజశ్రీ పొలిటికల్ ఎంట్రీ?
వంశీ భార్య పంకజశ్రీ యాక్టివ్‌నెస్ చూసి గన్నవరంలో కొత్త చర్చ ప్రారంభమైంది. భర్త అరెస్ట్‌తో ఇక రాజకీయాల్లోకి భార్య ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వంశీపై మూడు కేసులు ఉన్నాయి. అవి ఇంకా పెరగొచ్చు కూడా. ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో కష్టాలు తప్పట్లేదు. ఇప్పట్లో ఆయన జైలు నుంచి రిలీజ్ కష్టమే అంటున్నారు. అందుకే, తన రాజకీయ వారసురాలిగా భార్యను ముందు ఉంచుతున్నారా? అనే డౌట్ వస్తోంది. పంకజశ్రీ మాటలు చూసి.. వైసీపీ సైతం ఆమెను ఎంకరేజ్ చేసేందుకు రెడీగానే ఉన్నట్టు సమచారాం.
Also Read : ఆ కంపెనీ ఎవరిది? జగన్ Vs విజయమ్మ..
వంశీ చాప్టర్ క్లోజేనా?
జూన్ 4న గన్నవరం నియోజకర్గంలో వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. వంశీని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఇష్యూని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనేది ఆ పార్టీ ఆలోచన. వైసీపీ తరఫున పంకజశ్రీకి కూడా ఆహ్వానం వచ్చిందని తెలుస్తోంది. అందుకు, ఆమె సైతం సిద్ధంగానే ఉన్నారని అంటున్నారు. అయితే, ప్రస్తుతం వంశీ హాస్పిటల్ వార్డులో ఉండటంతో ఆయన బాగోగులు భార్యే చూసుకుంటున్నారు. అప్పటికల్లా వంశీ హెల్త్ సెట్ అయి.. జైలుకు తిరిగి వెళ్లిపోతే.. పంకజశ్రీకి కాస్త టైమ్ దొరుకుతుంది. లేదంటే, భర్తతోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ఎన్నికల నాటికైనా గన్నవరంలో పంకజశ్రీ పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే.. వంశీ మేటర్ క్లోజేనా?