BigTV English

Twitter Post: ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌

Twitter Post: ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి ట్వీట్ వైరల్‌

Venkaiah Naidu Opinions On Meeting Between Chandrababu Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి శుభపరిణామం అని వెంకయ్యనాయుడు తనదైన శైలిలో అభివర్ణించారు. ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు.


అంతేకాదు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు సమయస్పూర్తితో ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్టర్‌ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఏపీ, తెలంగాణ సీఎంల భేటీపై రెండు రాష్ట్రాల ప్రజలు మంచి శుభపరిణామం అని, తెలుగు రాష్ట్రాల అభివృధ్ధి, అభ్యున్నతికి పాటుపడాలని ఇరువురిని కోరుతున్నారు.

Also Read: 16 ఎంపీ సీట్లతో ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కన్నారు.. కానీ,.. : మంత్రి జూపల్లి


అంతేకాకుండా ఇరు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి విషయంలోనూ పోటీ పడాలని రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను కలుసుకోవడం తెలంగాణలోనూ పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. చూడాలి మరి ఆ పార్టీ తెలంగాణలో పుంజుకోనుందా లేదా అనేది లోకల్‌ ఎన్నికల్లో తేలిపోనుందంటూ కొందరి నేతల అభిప్రాయం.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×