BigTV English
Advertisement

India China Border: కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా.. భారత్ సరిహద్దులో బంకర్ల నిర్మాణం

India China Border: కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా.. భారత్ సరిహద్దులో బంకర్ల నిర్మాణం

India China Border: చైనా మరోసారి భారత్‌ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే భారత సరిహద్దులను చైనా అస్థిర పరిచేందుకు కొంత కాలంగా కుట్రలు చేస్తోంది. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు లడఖ్‌లో ప్యాంగాంగ్ సరస్సు చుట్టు ప్రక్కల అండర్ గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు.


ఆయుధాలు ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరం వైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఆ బంకర్లు నిర్మాణాలు వాస్తవాధీన రేఖకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో 2020కి ముందు ఎటువంటి మానవ సంచారం లేదు.
2021-22 మధ్య నిర్మించిన బంకర్లు ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఈ బేస్‌లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాత్రి భద్రపరచడం కోసం నిర్మించిన బంకర్లుగా ఇవి కనిపిస్తున్నాయి.

యూఎస్‌కు చెందిన బ్లాక్ స్కై సంస్థ అందించిన చిత్రాల్లో ఇందుకు సంబందించిన వివరాలు తెలుస్తున్నాయి. సాటిలైట్ మే30 వ తేదీన తీసిన ఫోటోలో ఒక పెద్ద బంకర్, దానికి 8 ఎన్ ట్రాన్స్‌లు, మరో చిన్న బంకర్, దానికి 5 ఎన్ ట్రాన్స్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే విధంగా ప్రక్కనే ఉన్న పెద్ద బిల్డింగ్‌లు, సైనిక వాహనాలతో అనేక షెల్టర్లు ఉన్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడులు నుంచి రక్షించుకోవడానికి చైనా ఆర్మీ షెల్టర్లు నిర్మించుకున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.


మరో వైపు ఇటీవల జరిగిన ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ , చైనా విదేశాంగ మంత్రి యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో దైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలపై వీలేనంత త్వరగా పరిష్కారించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలు తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి అంగీకారం తెలిపారు.

Also Read: కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్ సన్నిహితుడు.. ఆ స్థానంలో కమలాను..

చైనా భారత్ సరిహద్దు వద్ద బంకర్లు ఏర్పాటు చేసి వాటి వద్ద ప్రధాన కార్యాలయాన్నినిర్మించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం తూర్పు లడఖ్‌లోని చైనా స్థావరాన్ని పటిష్టం చేసుకోవడం మనం గమనించవచ్చు. గాల్వాన్ లోయ యొక్క ఆగ్నేయ ముఖంవైపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరం సైనిక రక్షణ కోసం టన్నెలింగ్ చేయడానికి చైనా చేస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిబింబించేలా చేస్తుంది. ఇక్కడ ఆయుధాలు ఇంధనం, నిల్వ చేయడానికి భూగర్భ బంకర్లను చైనా నిర్మించింది. అంతే కాకుండా సాయుధ వాహనాలకు గట్టి ఆశ్రయాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. అయితే ప్రధాన కార్యాలయంతో పాటు ఈ బంకర్లు పబ్లిక్ మ్యాపింగ్ అప్లికేషన్‌లో కనిపించలేదు. కందకాలు.. వీటితో పాటు రోడ్లు ఇక్కడ విస్తృతంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయి

 

Tags

Related News

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

Big Stories

×