Vidadala Rajini: పుల్లారావు జాగ్రత్త.. అధికారంలో ఉన్నామని రెచ్చిపోకండి.. కాలం మారుతది, అధికారం శాశ్వతం కాదు, నా గురించి తెలుసుకోండి. నా మీదే కేసు పెడతారా.. అంటూ మాజీ మంత్రి విడదల రజినీ సీరియస్ కామెంట్స్ చేశారు. చిలకలూరిపేట లో రజినీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసుపై రజినీ స్పందించారు. ఈ సంధర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లక్ష్యంగా రజినీ సంచలన కామెంట్స్ చేశారు.
కోటి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు, రజినీతో పాటు మరికొంత మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై శనివారం విడదల రజినీ మాట్లాడుతూ.. తనపై పూర్తి అవాస్తవాలతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందన్నారు. మొత్తం పుల్లారావు డ్రామా ఆడినట్లు పోలీసులు కూడ ఆడుతున్నారన్నారు. ఇక్కడ కేసు నమోదైతే తన పేరు వస్తుందని, అందుకే వేరే వ్యక్తిని పురమాయించి కేసు నమోదు చేశారని రజిని ఆరోపించారు. అలాగే ఇటీవల చిలకలూరిపేటలో విద్యుత్ పోరు నిర్వహిస్తే, తనతో పాటు 30 మందిపై కేసులు నమోదు చేశారన్నారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని, చిలకలూరిపేటలో అరాచక పాలన సాగుతుందన్నారు. తన మరిదిపై, తనపై కేసులు పెట్టి వేధించినంత మాత్రాన ఇక్కడ ఎవరూ భయపడరన్నారు. కుటుంబాలు మాకే కాదు, మీకు కూడ ఉన్నాయని ముందు అది తెలుసుకోండన్నారు. మీ కాలం ఎక్కువ రోజులు ఉండదు.. మేమొస్తాం.. ఎక్కడ దాక్కున్నా పట్టుకొని వస్తా.. వడ్డీతో సహా ఇస్తా పుల్లారావు అంటూ రజినీ సీరియస్ అయ్యారు.
Also Read: Chandrababu – Pawan Kalyan: అక్కడ పవన్.. ఇక్కడ చంద్రబాబు.. బీజేపీకి బూస్ట్ ఇచ్చారా?
ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక్క మచ్చ లేకుండా పని చేశానని, ఏమైనా చేసుకోండని కూటమికి సవాల్ విసిరారు. నా ఏడేళ్ల రాజకీయం ముందు పుల్లారావు పాతికేళ్ళ రాజకీయం ఓడిపోయిందని, అక్రమ అరెస్ట్ లకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రిటైర్ అవుతారని అనుకుంటున్నారేమో.. నేనెంటో చూపిస్తానని రజినీ సవాల్ విసిరారు. అంతేకాకుండ పుల్లారావుకు వత్తాసు పలుకుతున్న ఏ నాయకుడిని, అధికారిని వదిలేది లేదని మున్ముందు అసలు కథ తెలుస్తుందని రజినీ హెచ్చరించారు. మరి రజినీ కామెంట్స్ కి ఎమ్మెల్యే పుల్లారావు స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.