Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ కి సంబంధించిన మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ వేదికగా జరుగుతాయి. భారత జట్టు చివరిసారిగా 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పట్లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ విజయాన్ని నమోదు చేసింది. 2017లో ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది భారత జట్టు. టైటిల్ కి అడుగు దూరంలో నిలిచిపోయింది.
Also Read: Noman Ali – Hat-trick: పాక్ స్పిన్నర్ నౌమాన్ అలీకి హైట్రిక్.. చరిత్రలోనే తొలి ప్లేయర్ గా !
ప్రస్తుతం భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ 2025 లో బరిలోకి దిగబోతోంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొనబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటివరకు రెండుసార్లు విజేతగా నిలిచింది. 2025లో మరోసారి టైటిల్ గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కాగా ఛాంపియన్ ట్రోఫీ 2025 కి సమయం దగ్గర పడుతుండడంతో ఈ టోర్నీకి సంబంధించిన ఐసీసీ లాంచ్ చేసిన ” ఆల్ ఇన్ ది లైన్” క్యాంపెయిన్ లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పాల్గొన్నారు.
హార్దిక్ పాండ్యా తో పాటు ఇంగ్లాండ్ బ్యాటర్ ఫీల్ సాల్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ, పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్లేయర్ షాహిన్ అఫ్రిది, భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో హార్దిక్ పాండ్యా, అఫ్రీదీ ఇద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ని పట్టుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది.
దీంతో ఈ ఫోటోషూట్ ని పాకిస్తాన్ లో నిర్వహించారని, ఇందుకోసం హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ వెళ్ళాడంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇది చూసిన అభిమానులు సైతం హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ వెళ్లాడని భావించారు. కానీ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ వెళ్లలేదు. ఈ ఈవెంట్ దుబాయిలో జరిగినట్లు సమాచారం. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కర్టెన్ రైజర్ కార్యక్రమాలను స్టార్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఐసీసీ ఆధ్వర్యంలో “ఆల్ ఇన్ ది లైన్” అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
Also Read: Kuldeep-RCB: మీ ముఖాలకు ఎప్పుడైనా కప్పు గెలిచార్రా.. RCB ఇజ్జత్ తీసిన కుల్దీప్..!
ఇందుకు సంబంధించిన వీడియోని ఐసిసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ” భారత క్రికెట్ బ్రాండ్ ని ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాం. 8 సంవత్సరాల తర్వాత ఈ ఐకానిక్ టోర్ని తిరిగి ప్రారంభం కావడం క్రికెట్ కి మంచి బూస్ట్. ఇది వన్డే ఫార్మాట్ కి విభిన్నమైన ఆదరణను తీసుకువస్తుంది. ఈ టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. అభిమానులు కూడా ఈ టోర్నీ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ టోర్నీలో ప్రత్యర్థుల ఎదుట మా సత్తాను ప్రదర్శిస్తాం” అని తెలిపాడు హార్దిక్ పాండ్యా.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">