Podarillu Today Episode October 13th : ఉదయం లేవగానే జమున అందరికీ కాఫీ పెట్టి తీసుకొని వస్తుంది. అయితే అందరికీ ఇచ్చినట్లుగానే నారాయణకు కూడా ఇవ్వాలని అనుకుంటుంది. అయితే బయటికి వెళ్లి ఆమె నారాయణ కొట్టి ఇవ్వగానే అది చూసిన నారాయణ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు ఆ ప్లేట్ లో ఉన్న టీ ని విసిరి కొట్టేస్తాడు. అంతేకాదు ఆమెను చంపేస్తాను అని మంచమెత్తి విసిరేయాలని అనుకుంటాడు.. అందరు వెళ్లి ఏంటి నాన్న ఆవేశం చంపేస్తారా ఏంటి అని నారాయణ పై సీరియస్ అవుతారు. మీరు ఎందుకు ఇంత కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్పగానే నారాయణ దీని గురించి మీకు తెలియదు రా పాలు తాగే వయసులో వారిని వదిలేసి వెళ్లిపోయింది.. ఇన్ని రోజులకి వచ్చింది అంటే ఏదో నాటకం మొదలు పెట్టడానికి వచ్చింది అని నారాయణం ఎంత చెప్పినా కూడా అందరూ కూడా చాలా సీరియస్ అవుతారు..
అప్పుడు నీ వల్ల వెళ్ళిపోయింది ఇప్పుడు నాకోసం వచ్చింది కదా నువ్వు ఆవిడని ఏమైనా అంటే మాత్రం నేను అసలు ఊరుకోను అని కన్నా జమునకు సపోర్ట్ గా ఉంటాడు.. అంతే కదూ ఆవిడ జోలికి వెళ్తే నేను అస్సలు ఊరుకోను. ఆమెను ఇంట్లో నుంచి పంపించాలని చూసినా బాధపెట్టిన నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తాను అని అనగానే నారాయణ ఒక్కసారిగా కన్నా వైపు ఒక లుక్కేస్తాడు. ఇక అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా పెద్దవాళ్ళని పట్టుకుని ఆ మాటలు ఏంట్రా అని మహాలక్ష్మి కన్నా కి బుద్ధి చెబుతుంది. ఇక లోపలికి వెళ్లిన జమునతో అసలు ఏం జరిగింది ఆయన మీపై ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతారు. ఆవిడని చంపేసినట్లుగా నన్ను కూడా చంపేస్తాడని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని ఆమె అబద్ధం చెప్తుంది. అందరి కోసం వంట చేస్తానని వంట గదిలోకి వెళ్తుంది. అయితే చక్రి మహా అలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటాడు..
కన్న వాళ్ళమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి పని చేస్తూ ఉండడం చూసి చక్రి మహాలక్ష్మి కూడా ఏంటి ఇల్లాలుగా పని చేస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహ ఎంత బాగుందో అంటూ చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. అయితే తన ఊహల్లో తన భార్యని గురించి ఊహించుకుంటూ ఉంటాడు. ఈ ఇంటి ఇల్లాలుగా మహాలక్ష్మి అన్ని పనులు చేస్తూ ఉంటే చాలా బాగుంది అంటూ చక్రీ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. నిజంగానే మహాలక్ష్మి అలా చేస్తే ఎంత బాగుంటుందో అంటూ తెగ మెలికలు తిరిగిపోతూ సిగ్గు పడిపోతూ ఉంటాడు చక్రి.. ఈ విషయాన్ని కేశవ కి చెప్తూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. అయితే జమున అందరికీ బాక్సులు తెచ్చి టిఫిన్లు పెడుతూ సేవలు చేస్తూ ఉంటుంది. ఈ కథ చక్రికి కౌంటర్ ఇస్తూ కేశవ నాకెందుకు వేరే లాగా కనిపిస్తుంది అని అంటాడు. కేశవ ఊహల్లో చక్రి పరిస్థితి దారుణంగా ఉంటుంది.
జమున అందరికీ బాక్సులు చేసి పెడుతూ ఉంటే ఎందుకమ్మా నీకు ఈ శ్రమ మేము ఉన్నాం కదా తలా ఒక పని చేస్తాము అని అంటారు. నాకేం పని ఉంది బాబు ఇన్ని రోజులు మిమ్మల్ని అందరిని వదిలేసి తప్పు చేశాను. ఇప్పుడు ఆ పాపం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అని జమున అంటుంది. ఇక కన్నా కి ఎగ్జామ్ ఉండడంతో జమున ఆశీర్వాదం తీసుకుంటాడు. అయితే ఒకప్పుడు మాధవ్ ఆశీర్వాదం తీసుకోవడంతో మహాలక్ష్మి మీ అన్నయ్య ఆశీర్వాదం అవసరం లేదా అని అంటాడు. ఇక జమున ఈ ఇంటిని నాకు అప్పచెప్పండి నేను చూసుకుంటాను అని అంటుంది. అయితే అందరూ ఆమె ఆ మాట అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇలా అంటుంది అని అనుకుంటారు. అంటే మీ ఇంటిని నాకు అప్పజెప్పండి అన్ని పనులు నేను దగ్గరుండి చేసుకుంటాను అని జమున అంటుంది.
మాధవ్ మనిషా సైట్ కి రావడంతో చాలా సంతోషంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కన్న వాళ్ళ అమ్మ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటారు. అయితే కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అతను చాలా మంచిగా ఉన్నారు అని మాధవ చెప్పగానే.. మనిషా చాలా సంతోషంగా ఉంటుంది అంతే కాదు కేశవ కొత్త షాప్ కి ఓనర్ గా కూడా మారడంతో మనిషా అవునా చాలా సంతోషంగా ఉంది కదా అని అంటుంది. అటు జమున తన కొత్త మొగుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఉన్న కాడికి డబ్బులు దోచేస్తాను అని అంటుంది. ఇక నారాయణ జమునకి మళ్లీ ఎందుకు వచ్చావు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక జమున మాత్రం ఇంట్లో ఉన్న కాడికి డబ్బులు తీసుకొని దాచిపెట్టుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..