BigTV English

Village Volunteer : ఏపీలో మరో వాలంటీర్ ఘాతుకం.. టెన్త్ విద్యార్థినిపై అఘాయిత్యం

Village Volunteer : ఏపీలో మరో వాలంటీర్ ఘాతుకం.. టెన్త్ విద్యార్థినిపై అఘాయిత్యం

Village Volunteer : ఏపీ ప్రభుత్వం.. ప్రజలందరికీ పాలన అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల కారణంగానే రాష్ట్రంలో మహిళలు, యువతులు మిస్ అవుతున్నారంటూ వారాహి యాత్రలో పవన్ చేసిన కామెంట్స్.. తీవ్ర సంచలనం సృష్టించాయి. అందుకు తగ్గట్టుగానే వాలంటీర్ల ప్రవర్తన కూడా ఉంటుంది. చిన్నపిల్లలతో పనులు చేయించుకోవడం, డబ్బుల కోసం హత్యలు చేసిన ఘటనలు వెలుగుచూశాయి.


తాజాగా ఏలూరు జిల్లాలో మరో వాలంటీర్ చేసిన దుర్మార్గం వెలుగు చూసింది. దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాలంటీర్ నీలాపు శివకుమార్.. ఆధార్ కార్డులు కావాలన్న వంకతో పదే పదే బాలిక ఇంటికి వెళ్లి.. పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. తరచుగా వాలంటీర్ ఇంటికి వస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా ఈ విషయం వెలుగుచూసింది. బాలిక చెప్పిందంతా విన్న తల్లిదండ్రులు వాలంటీర్ శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×