BigTV English

Pawan Kalyan: కడపలో ఇంత సమస్య ఉందని అనుకోలేదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కడపలో ఇంత సమస్య ఉందని అనుకోలేదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేష్ అధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. పిల్లలు స్కూల్ కి ఎంతో సంతోషంగా రావాలని. అలాంటి వాతావరణం ఏర్పరచడమే ధ్యేయంగా ఈ మీటింగ్ జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ.. రీల్ హీరోల కంటే రియల్ హీరోలే మనకు ఆదర్శం కావాలని పిల్లలకు పిలుపునిచ్చారు. ఇక తండ్రి తిన్న కంచాన్ని తనయుడు తీయడం చూపరులను ఆకర్షించి, ఆలోచింప చేసింది.


బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్.. కడప మున్సిపల్ హైస్కూల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. టీచర్లంటే తనకెంతో గౌరవమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తాను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నానని అన్నారు ఏపీ సీఎం. పిల్లలు స్కూలుకు ఎంతో సంతోషంగా రావాలని. అప్పుడే వారికి విద్యా వికాసం లభిస్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

మరో వైపు కడప మున్సిపల్ హైస్కూల్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ హాజరు కాగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. విద్యార్ధులతో పవన్ ముఖా ముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విలువలను పాటించే వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తనకెందరు సినిమా హీరోలంటే ఇష్టమున్నా.. వనజీవి రామయ్య వంటి సామాజిక హితులను తాను నిజమైన హీరోలుగా భావించి ఆదర్శంగా తీసుకుంటానని. ఇలాంటి రియల్ హీరోలకు రీ-రికార్డింగులుండవని. వారినే మనం ఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలని.


Also Read: మనవాడికో మాట, పగవాడికో మాటా? ఇది అల్లు అర్జున్‌కు వర్తిస్తుందా అంబటి?

రైతులు, సైనికులు, తల్లిదండ్రులు, సఫాయి కార్మికులు.. వీరే మన నిజ జీవితమైన కథానాయకులు గా తీసుకోవాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్‌. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు కావాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌.  పార్టీలు మారిన పథకాలు మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. దేశం బాగుపడాలంటే కాంట్రాక్టర్ల మీద కాదు.. అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలని కడపలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

దేశంలోనే అత్యధిక జీతం పొందే వృత్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే హీరోలని సినిమాల్లో నటించేవారిలో కాదు, అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సినీ నటుడిగా చెప్తున్నానని.. సినిమా డైలాగులు చెబితే.. సినీ హీరోలు నడిస్తే వెనక రీరికార్డింగులు వస్తాయని అన్నారు. కార్గిల్ లో చనిపోయిన వారికి, ఉపాధ్యాయులకు రీరికార్డింగులు ఉండవని తెలిపారు. కానీ వారే నిజమైన హీరోలు.. వారిని గౌరవించండని కడప జిల్లా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌లో పవన్ అన్నారు.

విజయవాడలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కి వచ్చిన తల్లిదండ్రులు సైతం.. బిగ్ టీవీతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రైవేటు స్కూళ్లకు మల్లే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

బాపట్లలో జరిగిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి హాజరైన బాబు, లోకేష్.. పిల్లలతో కలసి భోజనం చేశారు. అయితే.. తండ్రి వదిలి వెళ్లిన ప్లేట్ తనయుడు తీయడం.. చూపరులను ఆకర్షించింది.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×