Karthik Subbaraj: చాలామంది దర్శకులకు ఇండస్ట్రీ ఎంటర్ అయిన తర్వాత అయినా, ఎంటర్ అవ్వక ముందు అయినా కొందరు నటీనటులతో కలిసి పనిచేయాలని ఉంటుంది. వారి కెరీర్ కొనసాగుతున్నందుకు వరకు అదే వారి డ్రీమ్‌గా ఉండిపోతుంది కూడా. కానీ ఆ కలను నిజం చేసుకునే అదృష్టం అందరికీ ఉండదు. కొందరు దర్శకులకు మాత్రమే తమ ఫేవరెట్ హీరోలతో కలిసి పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఛాన్స్ తనకు రాలేదని ఫీలవుతున్నాడు ఒక కోలీవుడ్ డైరెక్టర్. ఇప్పటికే కాదు.. ఎప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానని బయటపెట్టాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. సూర్యతో ‘రెట్రో’ తెరకెక్కించిన కార్తిక్ సుబ్బారాజ్.
మరొక దర్శకుడికి ఛాన్స్
చాలామంది కోలీవుడ్ డైరెక్టర్లకు తమిళ ప్రేక్షకుల్లోనే కాదు.. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి పాపులారిటీ ఉంది. అలాంటి డైరెక్టర్స్‌లో కార్తిక్ సుబ్బరాజ్ ఒకరు. డైరెక్టర్‌గానే కాకుండా రైటర్‌గా కూడా ఇప్పటికే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తిక్. తాజాగా సూర్యతో కలిసి ‘రెట్రో’ అనే మూవీ తెరకెక్కించాడు. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు కార్తిక్ సుబ్బరాజు. అందులో భాగంగానే తనకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి పనిచేయాలని ఉన్నా ఆ ఛాన్స్ మిస్ అయిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు దక్కాల్సిన ఛాన్స్ మరొక దర్శకుడికి దక్కిందని బయటపెట్టాడు.
చాలాసార్లు ట్రై చేశాను
‘‘ఇన్నేళ్లలో దళపతి విజయ్‌కు నేను ఎన్నో కథలు వినిపించాను. కానీ అందులో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. నేను కథలు మంచిగా చెప్పలేకపోయానని నేనే ఒప్పుకుంటాను. దళపతి 69 ఆడిషన్‌లో కూడా నేను పాల్గొన్నాను. టీమ్‌కు కథ వినిపించాను. కానీ అది కూడా వర్కవుట్ అవ్వలేదు. నేను వేరే కథతో వెళ్లే సమయానికి హెచ్ వినోథ్‌ను దర్శకుడిగా ఫైనల్ చేశారు’’ అని వాపోయాడు కార్తిక్ సుబ్బరాజు. హెచ్ వినోథ్ దర్శకత్వంలో తను నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోనున్నాడు. అంటే ఇదే విజయ్ కెరీర్‌లో చివరి సినిమా. అందుకే తన డ్రీమ్ హీరోతో పనిచేయలేకపోయానని ఫీలవుతున్నాడు కార్తిక్ సుబ్బరాజు.
Also Read: షూటింగ్ సెట్‌లో ఆయనపై గన్ గురిపెట్టిన విజయ్.. వీడియో వైరల్
గట్టి పోటీ
విజయ్ (Vijay), కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కలిసి ఒక సినిమా చేస్తారని పలుమార్లు కోలీవుడ్‌లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ అవి ఎప్పుడూ నిజం కాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. సూర్య, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ‘రెట్రో’ (Retro) మూవీని తెరకెక్కించాడు కార్తిక్ సుబ్బరాజు. ఈ సినిమా మే 1న విడుదల కానుండగా నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఈ పోటీని తట్టుకోవడం కోసం ప్రేక్షకులను తమ సినిమాల వైపు తిప్పుకోవడం కోసం ఎవరికి వారు గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. సూర్య, నాని మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు గెలుస్తారా అని ఆడియన్స్‌లో కూడా ఆసక్తి మొదలయ్యింది.