AP Tourism Homestay: మీరు విశాఖలో ఉంటున్నారా? అయితే ఈ ఛాన్స్ సూపర్ అనాల్సిందే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో, ఇక్కడి నగర వాసులకు నెలకు కూర్చొని రూ. 50,000 దక్కే ఛాన్స్ దక్కింది. ఇలాంటి మరి ఏ నగరానికి లేదని చెప్పవచ్చు. మరి విశాఖ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే, ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
విశాఖ నగరమే ఒక వరం..
పర్యాటక పరంగా విశాఖపట్నం (Vizag) రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. బీచ్‌లు, అరకు, బోర్రగుహలు, కైలాసగిరి వంటి అద్భుతమైన ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇలాంటి సమయంలో, స్థానికులకూ ఆదాయం పొందే అవకాశంగా మారింది. ఆ అవకాశమే హోమ్‌స్టేలు. ఈ అవకాశాన్ని నగరవాసులకు చేరువ చేసింది ఏపీ ప్రభుత్వం.
హోమ్‌స్టే అంటే ఏమిటి?
హోటళ్లను కాకుండా, పర్యాటకులు స్థానికుల ఇళ్లలో ఉండే విధానమే హోమ్‌స్టే. అంటే, మీ ఇంటిలోని ఓ గది లేదా అంతస్తును రోజువారీ అద్దెకు ఇచ్చే అవకాశం. ఇది పర్యాటకులకు ఆత్మీయతను, స్థానిక జీవనశైలిని పరిచయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ 2025 – 2029 పర్యాటక విధానంలో భాగంగా హోమ్‌స్టే నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విధానం ద్వారా పర్యాటకులకు తక్కువ ధరలో బస, స్థానికులకు ఆదాయం రెండు లక్ష్యాలు నెరవేరుతాయి.
హోమ్‌స్టే నమోదు ఎలా చేయాలి?
మీ ఇంటిని హోమ్‌స్టేగా నమోదు చేయాలంటే ముందుగా Andhra Pradesh Tourism అధికారిక వెబ్‌సైట్‌ను (https://tourism.ap.gov.in) లేదా కేంద్ర నిధి పోర్టల్‌ను (https://nidhi.tourism.gov.in) సందర్శించాలి. అక్కడ హోమ్‌స్టే హాస్టెల్/బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ స్కీంలో రిజిస్ట్రేషన్ చేయవచ్చు. మీ ఇంటికి సంబంధించిన ఫోటోలు, చిరునామా, గదుల వివరాలు, ID ప్రూఫ్ మొదలైనవీ అప్‌లోడ్ చేయాలి. ఒకసారి నమోదు అయిన తర్వాత, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం హోమ్‌స్టేకు గుర్తింపు లభిస్తుంది.
ఇంట్లో కనీసం ఒక గది..
ఈ పథకం కోసం మీ ఇంట్లో కనీసం ఒక గది బాగా ఉండాలి. బాత్రూం, మంచం, శుభ్రత, రక్షణ వంటి అంశాలపై అధికారులు తనిఖీ చేస్తారు. ఒక ఇంట్లో గరిష్ఠంగా 6 గదులు వరకు హోమ్‌స్టేగా నమోదు చేయవచ్చు.
Also Read: Sunny Yadav: భయ్యా సన్నీ అరెస్ట్.. పాక్ నుండి రాగానే అదుపులోకి.. ఎన్ఐఏ రంగంలోకి?
పర్యాటకుల కోసం ప్రత్యేక అనుభవం
హోటళ్ల కంటే హోమ్‌స్టేలు పర్యాటకులకు ఇంట్లో ఉన్న ఫీల్ ఇస్తాయి. విశాఖలోని స్థానిక సంప్రదాయాలను, ఆహారాన్ని, సంస్కృతిని దగ్గరగా అనుభవించేందుకు ఇది బెస్ట్ ఛాన్స్. అందుకే విదేశీ పర్యాటకులకి హోమ్‌స్టేలు చాలా ఇష్టంగా ఉంటాయి.
విశాఖకు ప్రత్యేక గుర్తింపు
విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినిగా పేరుగాంచింది. ఇప్పుడు ఇది హోమ్‌స్టే సిటీగా కూడా మారే దిశగా ఉంది. ఇప్పటికే అరకు, పాడేరు, భీమిలి, యారాడ వంటి ప్రాంతాల్లో పలు హోమ్‌స్టేలు కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
ఆర్థికంగా లాభదాయకం
మీ ఇంటి ఖాళీ గదిని అద్దెకు ఇచ్చి నెలకు రూ. 10,000 నుండి రూ. 40,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఇది ఉద్యోగం లేకపోయినా కుటుంబానికి తగిన ఆదాయ మార్గంగా మారుతుంది. ముఖ్యంగా గృహిణులు, సీనియర్ సిటిజన్లకు ఇది మంచి అవకాశం.
సంప్రదించండి
మీరు విశాఖలో ఉంటే, హోమ్‌స్టేగా మీ ఇంటిని నమోదు చేయాలంటే VMRDA టూరిజం కార్యాలయం నంబర్ 0891-2754716, AP Tourism వెబ్‌సైట్ https://tourism.ap.gov.in లను సంప్రదించండి. ఈ విధానం ద్వారా పర్యాటక రంగం మరింత విస్తరిస్తుంది. స్థానికుల జీవనోపాధి మెరుగవుతుంది. పర్యాటకులు కూడా తమ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా అనుభవించగలుగుతారు. విశాఖ ప్రజలకు ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మీ ఇంటిని హోమ్‌స్టేగా మార్చడం అనేది కేవలం అద్దె పొందడం కాదు. అది పర్యాటకులతో స్నేహం, సంస్కృతి మార్పిడి, ఆదాయాన్ని కలిగించే మార్గం. విశాఖకు వచ్చే వారి బసను ప్రత్యేకంగా మార్చే అవకాశం మీ ఇంటిలోనే ఉంది. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!