Arjun Reddy : ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘స్పిరిట్’ వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ నుండి దీపికా పదుకొనే (Deepika Padukone) ని తీసేసి త్రిప్తి డిమ్రీ (Tripti dimri)ని పెట్టడంతో ఈ వివాదం నెలకొంది. అయితే దీపికా పదుకొనే పీ.ఆర్.టీమ్ ఏ రేటెడ్ కంటెంట్ ఉండడం వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు తాజాగా ఓ ట్వీట్ లో తెలియజేసింది. దీనితో సందీప్ రెడ్డి వంగా దీపిక పదుకొనేని టార్గెట్ చేస్తూ ఇలా స్టోరీని లీక్ చేయడం ఏ మాత్రం బాలేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అయితే వీరి వివాదం ఇలా నడుస్తున్న సమయంలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ వహించిన అర్జున్ రెడ్డి సినిమా గురించి మరో వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కంటే ముందు మరో ఇద్దరు, ముగ్గురు హీరోలని అనుకున్నారట. కానీ ఆ హీరోలు ఎవరు సెట్ అవ్వలేదు. చివరికి విజయ్ దేవరకొండని తీసుకున్నారు. అయితే ఇన్నేళ్ల తర్వాత తాజాగా మంచు మనోజ్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు.అదేంటో ఇప్పుడు చూద్దాం..
అర్జున్ రెడ్డి మిస్ చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నా – మంచు మనోజ్
మంచు మనోజ్ (Manchu Manoj),నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కాంబోలో ‘భైరవం’ మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.అదేంటంటే..”అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా మొదట తీసుకుంది నన్నే.. సందీప్ రెడ్డి వంగాతో నేను చాలా రోజులు ట్రావెల్ చేశాను. కానీ ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అర్జున్ రెడ్డి సినిమాను రిజెక్ట్ చేశాను. కానీ అర్జున్ రెడ్డి సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను”.. అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక మనోజ్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మంచి సినిమా మిస్ చేసుకున్నావు కదా భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మనోజ్ మాటలపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇక అర్జున్ రెడ్డి సినిమా కోసం ముందుగా అల్లు అర్జున్ (Allu Arjun), శర్వానంద్(Sharwanand) వంటి హీరోలను కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవరు ఈ సినిమాలో నటించలేదు. ఇక తాజాగా మనోజ్ కూడా అర్జున్ రెడ్డి సినిమాని మిస్ చేసుకున్నాను అని చెప్పడంతో కొంతమంది నెటిజన్స్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తప్ప ఏ హీరో కూడా సెట్ అయ్యేవాడు కాదు.అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి.. అంతలా పాపులర్ అయిపోయారు. అలాంటి ఈ సినిమాలో మీరు హీరోగా చేస్తే సినిమా పరిస్థితి ఏంటో అంటూ మంచు మనోజ్ కి కౌంటర్స్ ఇస్తున్నారు నెటిజన్స్.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే (Shalini Pandey)కంటే ముందు హీరోయిన్ గా సాయి పల్లవి(Sai Pallavi)ని అనుకున్నారట డైరెక్టర్.కానీ సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోదు ఇలాంటి సినిమాలో ఎలా నటిస్తుందని కొంతమంది చెప్పడంతో తన అభిప్రాయం మార్చుకొని షాలిని పాండేను తీసుకున్నారట. మొత్తానికి అయితే అటు విజయ్ దేవరకొండకు ఇటు సందీప్ కి ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ అందించింది ఈ సినిమా.
ALSO READ:‘మా’ ట్రైలర్.. ఒంటరిగా చూడకండి, ఉలిక్కిపడతారు.. చివరిలో ట్విస్ట్ మిస్ కావద్దు!