Vizag development 2025: ఒక్కోసారి కొన్ని నగరాల మీద ప్రత్యేక దృష్టి పడుతుంది. సముద్రపు ఒడ్డు, శాంతమైన వాతావరణం, అభివృద్ధికి అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు ఉంటే అంతే… సంస్థలు తమ రూటును మార్చేస్తాయి. ఇప్పుడు అలాంటి క్షణం విశాఖపట్నంకి వచ్చింది. వేల కోట్ల పెట్టుబడి, వేల ఉద్యోగాలు వెంటపడి మరీ విశాఖకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ సంస్థ రావడం వెనుక పెద్ద కథ ఉంది. ఇంతకు ఏం జరుగుతోంది అక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ కేంద్రంగా ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం సత్త్వా గ్రూప్ (Sattva Group) ఇప్పుడు విశాఖపట్నంలో భారీ ప్రాజెక్ట్ పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వీరు రూ.1500 కోట్ల పెట్టుబడితో ఒక ప్రపంచస్థాయి మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. ఇది కేవలం నిర్మాణం కాదు, విశాఖ అభివృద్ధికి ఒక మైలురాయిగా మారబోతుంది.
ఈ ప్రాజెక్ట్‌లో ఉండబోయే ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే ఔరా అనేస్తారు. అందుకే ఆ అంశాలు పూర్తిగా తెలుసుకోవాలన్న ఆశ మీకు ఉందా.. అందుకే ఈ కథనం పూర్తిగా చదవండి.
గ్రేడ్ A ఆఫీస్ స్పేసులు
భారీ కంపెనీల కార్యాలయాల కోసం అవసరమైన అధునాతన సదుపాయాలు కలిగిన కార్యాలయాల సముదాయం ఏర్పాటు కానుంది. ఇది ఐటీ, స్టార్టప్, కార్పొరేట్ రంగాల వికాసానికి బాగా అనుకూలంగా ఉంటుంది.
ప్రీమియం నివాస గృహాలు
ఉన్నత స్థాయి వసతులతో కూడిన అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించనున్నారు. విశాఖలో ఉద్యోగ అవకాశాలు పెరిగే కొద్దీ, నివాస అవసరాలు కూడా పెరుగుతాయి. దీనికి ముందుగానే గట్టి సిద్ధం అవుతున్నారు.
స్మార్ట్ సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఈ ప్రాజెక్ట్‌లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసి, గ్రీన్ టెక్నాలజీలతో కూడిన డిజైనింగ్ ఉండబోతోంది. నీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ వినియోగం, EV చార్జింగ్ హబ్‌లు వంటి పలు అంశాలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో లక్ష్యంగా 25,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. కేవలం నిర్మాణ సమయంలో కాదు, పూర్తయ్యాక అక్కడ వచ్చే కంపెనీలు, నివాస భవనాల నిర్వహణ, సేవా రంగాలు ఇలా అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి.
విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
విశాఖ ఇప్పటికే భారతదేశ తూర్పు తీరంలో ఉన్న అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండటం, సముద్ర పోర్టులు, రైలు, రోడ్డు, ఎయిర్ కంటెక్టివిటీ, టాలెంట్ పూల్, విద్యా సంస్థలు వంటి అంశాల వల్ల అనేక కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి మొగ్గు చూపుతున్నాయి.
Also Read: Vijayawada trains: ఇక వెయిటింగ్ టెన్షన్‌కి గుడ్‌బై! ఈ రైళ్లకు ఏసీ కోచ్ ల పెంపు..
అంతేకాకుండా, విశాఖను భవిష్యత్తులో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు, ప్రభుత్వ ప్రోత్సాహం, పారిశ్రామిక మద్దతులు అధికంగా లభించనున్నాయి. ఈ నేపథ్యంతోనే సత్త్వా గ్రూప్ ముందడుగు వేసింది.
ఈ పెట్టుబడి ప్రకటనను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించారు. ఆయన పేర్కొన్న విధంగా, ఇది విశాఖ అభివృద్ధి గాథకు ఓ కీలక మలుపు అని చెప్పొచ్చు.
అర్థికంగా, సామాజికంగా దోహదం
ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి నేరుగా వచ్చే పెట్టుబడుల విలువ కాకుండా, పరోక్షంగా వచ్చే ఆదాయాలు, ఉపాధి, సేవల విస్తరణ వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రియల్ ఎస్టేట్‌తో పాటు, హోటలింగ్, రిటైల్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లోనూ మార్పు కనిపించనుంది.
కంటెంట్ క్రియేటర్లకు, స్టార్టప్‌లకు హబ్‌గా మారే అవకాశమూ!
ఈ తరహా ప్రాజెక్ట్లు కలిగే వాతావరణం స్టార్టప్‌లకు, ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్స్‌కు అనువుగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోం తరహాలో హైబ్రిడ్ మోడల్‌లను అనుసరించే కంపెనీలకు ఇది శాశ్వత కార్యాలయాలుగా మారవచ్చు.
విశాఖ భవిష్యత్తు ఇక నూతన దిశలో
ఇప్పటికే విశాఖలో కొన్ని టాప్ ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాంటి సమయంలో సత్త్వా గ్రూప్ పెట్టుబడి ప్రకటన మరింత ఆకర్షణీయంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంటే విశాఖ నగర రూపురేఖలు మారిపోతాయని చెప్పొచ్చు. ఇప్పుడు రాష్ట్రం చూసేది రాజధాని కేంద్రంగా అభివృద్ధి అయిన నగరం కాదు, గ్లోబల్ ఐటీ.. ఇంటిగ్రేటెడ్ లివింగ్ మోడల్ నగరంగా మారిన విశాఖ. ఇదే దిశగా ఈ భారీ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది.