Shresta Iyer: టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో అతి తక్కువ కాలంలోనే స్థానం దక్కించుకొని… కెప్టెన్ దక్కించుకునే స్థాయి దాకా వెళ్లాడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament ) కూడా అద్భుతమైన కెప్టెన్ గా రాణిస్తున్నాడు. అయితే అలాంటి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్ట అయ్యర్ గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. ఇటీవల ఐటెం సాంగ్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Also Read: HBD MS Dhoni: బయటపడ్డ ధోని భాగోతం…హీరోయిన్ జీవితం నాశనం.. పిల్లలు పుడితే…. ?
ఐటమ్ గర్ల్ గా మారిన టీమిండియా క్రికెటర్ సోదరి
టీమిడియా యంగ్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. అలాగే తన అన్నయ్య శ్రేయస్ అయ్యర్ తో కూడా కలిసి చాలా ఫోటోలు… రీల్స్ చేసి మరి వైరల్ చేస్తూ ఉంటుంది శ్రేష్ట అయ్యర్. అయితే అలాంటి శ్రేష్ట అయ్యర్ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆమె హిందీలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
ఇటీవల సర్కారీ బచ్చా అనే బాలీవుడ్ సినిమాతో… ఇండస్ట్రీ లోకి కూడా అడుగు పెట్టింది శ్రేయస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్ట అయ్యర్. ఈ సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసి రచ్చ చేసింది. ఐటెం సాంగ్ చేయడమే కాదు తన అందాలు మొత్తం ఆరబోసి… అగ్రిమెంట్ కర్లే… అంటూ అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. అంతేకాదు ఈ సినిమాకు లైకులు, వ్యూస్ కూడా బాగానే వచ్చాయి.
కెప్టెన్ గా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో కేకేఆర్ జట్టు కెప్టెన్ గా కొనసాగాడు శ్రేయస్ అయ్యర్. ఈ నేపథ్యం లో 2024 ఐపిఎల్ ఛాంపియన్గా ( Indian Premier League Tournament 2024)… కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టును నిలిపిన ఘనత శ్రేయస్ అయ్యర్ ఖాతాలో పడింది. అయితే మొన్నటి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కు షిఫ్ట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. కానీ కెప్టెన్ గా మాత్రం శ్రేయస్ అయ్యర్ మంచి మార్కులు కొట్టేశాడు.