Vijayawada trains: దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రయాణికులకు శుభవార్త వచ్చింది. రైలు టికెట్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యమైన రూట్లలో నడుస్తున్న 8 రైళ్లకు శాశ్వతంగా అదనంగా 3AC (ఎకానమీ) కోచ్‌లు కలిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది వెయిటింగ్‌లో ఉన్న ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. జూలై 13, 2025 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానుండగా, కొన్ని రైళ్లకు జూలై 14 నుంచి మార్పులు వర్తిస్తాయి.
విజయవాడ–చెన్నై (12711, 12712), విజయవాడ–కాచిగూడ (12713, 12714), గుంటూరు–సికింద్రాబాద్ (17201, 17202), సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (17233, 17234) రూట్లలో నడుస్తున్న రైళ్లకు ఒక్కొక్కటి చొప్పున 3AC ఎకానమీ కోచ్‌లను శాశ్వతంగా కలిపారు. అంటే ఇక నుంచి వీటి సామర్థ్యం మరింత పెరుగుతుందన్న మాట.
ఈ కోచ్‌లు టికెట్ల లభ్యతను మెరుగుపరచడమే కాకుండా, ఎక్కువ మందికి తక్కువ ఖర్చుతో AC ప్రయాణ అనుభవం అందిస్తాయి. సాధారణంగా AC కోచ్ టికెట్ల ధరలు ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో, 3AC ఎకానమీ వర్గం మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. ఇక ఈ కోచ్‌లలో ప్రయాణించాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడమే మంచిది.
Also Read: Srisailam dam gates open: శ్రీశైలం గేట్లు ఓపెన్.. ట్రిప్ ప్లాన్ ఛేశారా? ముందే ఇవి తెలుసుకోండి!
ఇది శాశ్వత ఆగ్మెంటేషన్ కావడం వల్ల రైలు సంఖ్యల మార్పు లేకుండానే, కోచ్‌ల సంఖ్య మాత్రమే పెరిగిపోతుంది. దీని వల్ల ప్రయాణించాలనుకునే వారికి ఇక టికెట్ దొరకడం పెద్ద సమస్య కాదు. ముఖ్యంగా సెలవుల సీజన్, ప్రతిరోజు ప్రయాణించే ఉద్యోగస్తులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు.
ఈ మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, గుంటూరు, కాచిగూడ, సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ లాంటి ప్రధాన స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికోసం టికెట్ల అందుబాటు మెరుగవుతుంది. రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రజలకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించడమేనని చెప్పవచ్చు.
ఇకపై ప్రయాణికులు వెయిటింగ్ టికెట్ల కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త కోచ్‌లతో ఎక్కువ మందికి టికెట్లు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో ఈ విధంగా కోచ్‌లు పెంచే అవకాశమూ ఉంది.
ఈ మార్పులు సాధారణ ప్రయాణికులకు సహాయపడటమే కాకుండా, రైల్వే పై ఉన్న విశ్వాసాన్ని పెంచేలా ఉన్నాయి. ఇక మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకొని, ఈ కొత్త ఎకానమీ కోచ్‌ల ప్రయోజనాన్ని వినియోగించుకోండి!