OTT Movie : జాంబి లాంటి సినిమాలు ఇచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా మొత్తం ఇవి చేసే అరాచకం మామూలుగా ఉండదు. అన్ని భాషలలొ ఇటువంటి సినిమాలు తెరకెక్కుతున్నాయి. థియేటర్లలో, ఓటిటిలలో ఈ జానర్లో వస్తున్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. తెలుగులో వచ్చిన ‘జాంబి రెడ్డి’ ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక వైరస్ వల్ల మనుషులు జాంబిలుగా మారిపోతారు. మిగిలిన కొంతమంది వీటి నుంచి తప్పించుకుంటూ, ఎలా జీవిస్తారో ఇందులో చూపించారు. ఈ సినిమాలో ప్రతి సీన్ ఉత్కంఠంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
భూమి మీద ఒక వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ప్రపంచ జనాభా దాదాపుగా నాశనం అవుతుంది. ఈ వైరస్ సోకిన వాళ్ళు రక్తాన్ని రుచిమరిగే జాంబీలుగా మారిపోతారు. అన్ ఈ వైరస్ నుండి తప్పించుకుని, న్యూయార్క్ రాష్ట్రంలోని అడవుల్లో ఒంటరిగా బ్రతకడం కోసం పోరాడుతూ ఉంటుంది. ఆమె ఆహారం కోసం సమీప ఇళ్లలో వెతుకుతూ, వైరస్ సోకిన వాళ్ళ నుంచి తప్పించుకుని జీవిస్తూ ఉంటుంది. ఆమె తనను తాను కాపాడుకోవడానికి, జంతువుల మలంతో శరీరాన్ని కప్పుకుంటుంది. వాటి మూత్రాన్ని యాంటిసెప్టిక్‌గా ఉపయోగిస్తుంది. ఇటువంటి జీవితం ఆమె అడవిలో గడుపుతూ ఉంటుంది. ఆన్ భర్త జాసన్, ఆమె కుమార్తె హైలీ వైరస్ వ్యాప్తి సమయంలో అడవుల్లోకి పారిపోయారు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలీయని పరిస్థితిలో ఉంటుంది.
ఇక అన్ ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు, ఒకచోట గాయపడిన క్రిస్ అతని కుమార్తె ఒలివియాని కలుస్తుంది. ఆమె వీళ్ళకు సహాయం చేస్తుంది. వీళ్ళు ముగ్గురూ అడవిలో కలసి జీవించడం మొదలు పెడతారు. వీళ్ళ ముగ్గురి మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. చివరికి వీళ్ళంతా జాంబీల నుంచి తప్పించుకుంటారా ? అడవిలో ఈ ముగ్గురూ ఎటువంటి సమస్యలను ఎదుర్కుంటారు ? ఆన్ ఫ్యామిలీ ఏమౌతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ బీచ్ కెళితే ముసలి వాళ్ళైపోతారు… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని సర్ప్రైజులు
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ అపోకలిప్టిక్ సర్వైవల్ హారర్ మూవీ పేరు ‘హియర్ ఎలోన్’ (Here Alone). 2016 లో విడుదలైన ఈ మూవీకి రాడ్ బ్లాక్‌హర్స్ట్ దర్శకత్వం వహించారు. డేవిడ్ ఎబెల్‌టాఫ్ట్ దీనికి స్క్రిప్ట్ అందించారు. ఈ స్టోరీ ఒక అన్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఒక మహమ్మారి ప్రపంచ జనాభాను నాశనం చేసిన తర్వాత ఆమె అడవుల్లో ఒంటరిగా జీవించడానికి పోరాడుతూ ఉంటుంది. ఈ స్టోరీ ఊహించని మలుపులతో, ప్రేక్షకులని టెన్షన్ పెడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.