BigTV English

Visakha: విశాఖ నగరానికి మరో శుభవార్త.. ఆగస్టు ఒకటి నుంచి విమాన సర్వీసులు

Visakha: విశాఖ నగరానికి మరో శుభవార్త.. ఆగస్టు ఒకటి నుంచి విమాన సర్వీసులు

Visakha: కేవలం అభివృద్ధిపై కాకుండా.. రైళ్లు- విమాన సర్వీసులపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా విశాఖ సిటీ నుంచి కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వారంలో మూడు రోజులు సోమ, శుక్ర, శనివారాల్లో నడవనున్నాయి. విశాఖపట్నం-ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి.


కొత్త విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆగస్టు ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తాయి. విశాఖ నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 10 గంటలకు పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 10.30కి బయలుదేరి మధ్యాహ్నం 12.25కు విశాఖకు రానుంది.

మరో సర్వీసు ముంబై నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది. మళ్లీ విశాఖలో ఉదయం 9.40 గంటలకు బయలుదేరుతుంది. సర్వీసుల వివరాలను విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. టికెట్ల విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి.


అన్నట్లు విశాఖ టు ముంబై మధ్య సాయంత్రం ఓ సర్వీసు నడుస్తోంది. ఆగష్టు ఒకటి నుంచి ఉదయం వేళ మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచన చేశారు. ఇటీవల కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు మొదలయ్యాయి. వారంలో మూడు రోజులపాటు ఆయా సర్వీసులను ఇండిగో నడుపుతోంది.

ALSO READ: సినిమాలు చేయడం ఎందుకు? మరో మూడేళ్లున్న జగన్

ప్రతి రోజూ విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడతామన్నది కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట. జూన్ నుంచి విశాఖ-అబుదాబికి, విశాఖ నుంచి భువనేశ్వర్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడ – బెంగళూరుకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్ కనెక్టివిటీ క్రమంగా మెరుగుపడుతోంది.

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×