Girls harassed in Hostel: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ మెడల్ స్కూల్ హాస్టల్‌లో.. అమానవీయ ఘటన వెలుగుచూసింది. విద్యార్థుల రక్షణగా వహించాల్సిన వార్డెన్‌నే.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించింది. ఈ ఘటన తల్లిదండ్రులను, సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. వార్డెన్ సౌరిభాయ్‌పై బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు.. తీవ్ర సంచలనంగా మారాయి.
వార్డెన్ పై అసభ్య చర్యల ఆరోపణలు
కారంపూడి మెడల్ స్కూల్ హాస్టల్‌లో నివసిస్తున్న బాలికలు.. ఇటీవల వారి తల్లిదండ్రులకు తమపై జరుగుతున్న అమానవీయ వ్యవహారాన్ని తెలిపారు. వార్డెన్ సౌరిభాయ్ తరచూ వారిని అసభ్యంగా గమనిస్తూ, వారి ముందు బూతు చిత్రాలు చూపిస్తున్నాడని వారు వాపోయారు. అంతటితో ఆగక, విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో కామేరాలతో ఫోటోలు తీసి, ఆపై వాటిని చూపించి బెదిరింపులకు దిగుతుందని బాధితులు వెల్లడించారు.
వార్డెన్‌ను చితకబాదిన తల్లిదండ్రులు
ఈ సమాచారం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు.. తీవ్ర ఆగ్రహంతో హాస్టల్‌కు వెళ్లి వార్డెన్‌ను చితకబాదారు. ఒక ఆడిదానివై ఉండి ఇలాంటి పనులు చేయడానికి.. నీకు సిగ్గుగా లేదా అంటూ మండిపడ్డారు. స్థానికులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ ఆరోపణలు ఉన్న వార్డెన్
ఇది తొలిసారి కాదు. సౌరిభాయ్‌పై గతంలోనూ ఈ తరహా ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అయితే అప్పట్లో తల్లిదండ్రులు పెద్దగా స్పందించకపోవడం వల్ల.. వ్యవహారం ఇంతదాక వచ్చింది. ఇప్పుడు మరిన్ని ఆరోపణలు రావడంతో పరిస్థితి దారుణంగా మారింది. బాలికల భద్రతకు అనుకూలంగా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో.. ఇలాంటి వ్యక్తుల చేతిలో వారు నరకాన్ని అనుభవించాల్సి రావడం బాధాకరం.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటనపై కారంపూడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాధిత విద్యార్థినుల వాంగ్మూలం తీసుకుని, హాస్టల్ సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా, హాస్టల్ వర్గాలు ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. విద్యాశాఖ అధికారులు ఘటనపై నివేదిక కోరినట్లు సమాచారం.
సమాజం లో తీవ్ర ఆవేదన
పిల్లల భద్రత పేరుతో ప్రభుత్వ హాస్టల్స్‌లో.. వారికి ఆశ్రయం కల్పిస్తే, అదే చోట వారు లైంగిక ఆరోపణలకు గురవ్వడం దురదృష్టకరం. బాలికలపై ఇలాంటి చర్యలు తక్షణమే అణచివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: భార్యపై అనుమానం.. బ్రదర్‌ను పొడిచి పొడిచి..
ఈ సంఘటన మరోసారి ప్రభుత్వ హాస్టల్స్‌లో.. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇలాంటి దుర్మార్గులను బయటకు తీసి, శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని.. న్యాయం జరగాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
బాలికలకు బూతు చిత్రాలు చూపిస్తూ హాస్టల్ వార్డెన్ పైశాచికత్వం
పల్నాడు జిల్లా కారంపూడి మెడల్ స్కూల్లో ఘటన
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ సౌరిభాయ్
విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న వార్డెన్
వార్డెన్‌ను చితకబాదిన… pic.twitter.com/bJ8G3RkbP9
— BIG TV Breaking News (@bigtvtelugu) July 16, 2025