BigTV English

Rushikonda Beach : రుషికొండ బీచ్ లో మళ్లీ ఎగరనున్న బ్లూ ఫ్లాగ్ – ఎలా కోల్పోయింది? ఎలా తిరిగొచ్చింది?

Rushikonda Beach : రుషికొండ బీచ్ లో మళ్లీ ఎగరనున్న బ్లూ ఫ్లాగ్ – ఎలా కోల్పోయింది? ఎలా తిరిగొచ్చింది?

Rushikonda Beach : విశాఖలోని ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ రద్దయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారుల చర్యలతో రుషి కొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ అయ్యింది. విశాఖ ప్రజలతో పాటుగా అనేక మంది ప్రకృతి ప్రేమికులు కోరుకున్నట్లుగా.. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణ చేసినట్టు జిల్లా కలెక్టర్‌కి బ్లూ ఫ్లాగ్ ప్రతినిధులు సమాచారమిచ్చారు. రిషికొండ బీచ్ ను పరిశీలించిన దిల్లీ నుంచి వచ్చిన బ్లూ ఫ్లాగ్ ప్రతినిధులు.. రుషికొండ బీచ్ నకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణ చేస్తున్నట్లు కలెక్టర్ కు సమాచారం అందించారు. దాంతో.. రేపు రిషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ జెండాను ఎగరవేసి, నిలిచిపోయిన బీచ్ కార్యక్రమాల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేశ్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు.


విశాఖలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. బ్లూఫ్లాగ్ పునరుద్ధరణపై అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని.. వైసీపీ హయాంలో నిర్వహణ లోపాలతో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలతో అంతర్జాతీయ గుర్తింపుగా భావించే బ్లూ ఫ్లాగ్ కోల్పోయినట్లు తెలిపిన మంత్రి.. యుద్ధప్రాతిపదిక పర్యాటక శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తూ అనతి కాలంలోనే తిరిగి గుర్తింపు సాధించినట్లు వెల్లడించారు. బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం పర్యాటక శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్ చొరవను ప్రశంసించిన మంత్రి.. సర్టిఫికెట్ పునరుద్ధరణకు ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన మొదటి ఎనిమిది బీచ్‌లలో రుషికొండ ఒకటి. నిరంతరం ఈ బీచ్ లో భద్రతా ప్రణాళిక, పర్యావరణం, ట్రాఫిక్, నీటిశుద్ధి, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టేలా అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బీచ్ తో పాటుగా రాష్ట్రంలోని మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులు నిర్ణయించారు. మరిన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే మరింత అభివృద్ధి చెందుతాయని అంటున్నారు.


బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి?
ఇది ఓ గుర్తింపు పత్రంగా చెబుతుంటారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) అనే సంస్థ అంతర్జాతీయంగా ఉండే బీచ్ లలోని ప్రమాణాలను పరిశీలించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అందజేస్తుంటుంది. దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడంతో.. చాలా దేశాలు ఈ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కాగా.. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ వివిధ దేశాల్లోని బీచ్‌లు, మారినా, బోటింగ్ టూరిజం ప్రాంతాలకు ఈ సర్టిఫికేట్ ఇస్తుంటుంది.

ఇందుకోసం.. బీచ్‌ లలోని నీటి నాణ్యత, పర్యావరణ విద్య, భద్రత ప్రమాణాలు, పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు వంటి 33 ప్రమాణాలను పరిశీలించి.. ఈ సర్టిఫికేట్ ను జారీ చేస్తుంటుంది. భారత్ లో మొత్తం 8 బీచ్ లకే ఇలాంటి గుర్తింపు దక్కగా.. వాటిలో రుషికొండ బీచ్ ఒకటి. కానీ.. ఇక్కడి నిర్వహణలో వచ్చిన లోపాల కారణంగా ఈ సర్టిఫికేషన్‌ను తాత్కాలికంగా కోల్పోయింది. ఏపీ ప్రభుత్వ తాజా చర్యలతో తిరిగి పొందింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×