Weather News: తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐదు రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టాయి. కొన్ని చోట్ల అయితే 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఐదు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు చోట్ల పంట నష్టం జరిగింది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేపు తెలంగాణలో పెరగునున్న ఉష్ణోగ్రతలు
ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, రైతులకు పలు సూచనలు ఇస్తోంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో అయితే పొడి వాతావరణం ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. తెలంగాణలో నేటితో పోలిస్తే రేపు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్ లో గరిష్టంగా 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. హైదరాబాద్ 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉండొచ్చని వివరించింది.
ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం..
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం జిల్లా నాగసముద్రంలో 39.9 డిగ్రీలు, కడప జిల్లా అట్లూరులో 39.8 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నిండ్రలో 39.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 39.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గంటుపల్లిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ALSO READ: Jobs: ఏపీలో ఉద్యోగాలు.. లక్షకు పైగా వేతనం.. దరఖాస్తుకు ఇంకా 3రోజులే..!