E-Paper
Advertisement

బుమ్రా లేక‌పోతే ఇంత దిగజారుతారా? మీ కంటే పాకిస్తాన్ వెధ‌వ‌లే బెట‌ర్‌

బుమ్రా లేక‌పోతే ఇంత దిగజారుతారా?  మీ కంటే పాకిస్తాన్ వెధ‌వ‌లే బెట‌ర్‌
Advertisement

Mohammad Kaif On Team India Bowlers:  హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా చిత్తుగా ఓడిపోవడంపై మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) సీరియస్ అయ్యారు. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచినా కూడా అవమానంగానే తాను భావించే వాడినట్టు బాంబు పేల్చారు. టీమిండియా బౌలింగ్ దళం అత్యంత పేలవంగా ఈ మ్యాచ్ లో ప్రదర్శన ఇచ్చిందని ఆగ్రహించారు. ఇలాంటి బౌలింగ్ తో ముందుకు వెళితే టీమిండియా కొంప మునగడం గ్యారెంటీ అని హెచ్చరించారు. టీ20 లలో ఒక్కొక్కడు 50కి పైగా పరుగులు ఇవ్వడం అత్యంత దారుణమన్నారు. ఒక్కో బౌలర్ ఎకానమీ 13 కు పైగా ఉండడం తలదించుకోవాల్సిన అంశం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒక్కొక్క‌డు 50 ప‌రుగులు ఇస్తారా ? ఇక గ‌ల్లీ క్రికెట్ ఆడుకోండి

టీమిండియా బౌలింగ్ వైఫ‌ల్యంపై వెంటనే బీసీసీఐ రివ్యూ చేయకపోతే… టీమిండియాను కాపాడడం కష్టమేనని మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) హాట్ కామెంట్స్ చేశారు. బుమ్రా ఒక్కడు లేకపోతే టీమిండియా ఇంత దిగజారుతుందా? పాకిస్తాన్ బౌలర్ల కంటే చెండాలంగా బౌలింగ్ చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మహమ్మద్ కైఫ్. ఇలాంటి బౌలర్లు టీమిండియా కు గుడ్ బై చెప్పి గల్లీలో క్రికెట్ ఆడుకోవాలని హితువు పలికారు. తాను ఒక్క బౌలర్ ను టార్గెట్ చేసి మాట్లాడడం లేదని.. నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆడిన ప్రతి బౌలర్ అదే ప్రదర్శన కనబరిచాడని మండిపడ్డారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

టీమిండియా కంటే పాకిస్తాన్ బౌలింగ్ బెటర్

టీమిండియా కంటే పాకిస్తాన్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని మహమ్మద్ కైఫ్ సెటైరికల్ కామెంట్స్ చేస్తారు. ఉప్పల్ మ్యాచ్ లో ఒకవేళ టీమ్ ఇండియా గెలిచినా పెద్దగా సంతోష పడాల్సిన విషయం ఏమీ ఉండదని పరువు తీశారు. టీమిండియాకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. ఉప్పల్ లో టీమిండియా బౌలర్లను వెస్టిండీస్ క్రికెటర్లు ఫుట్ బాల్ ఆడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనోళ్లు చెత్తగా బౌలింగ్ చేస్తే… వెండి ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణించాలని ప్రశంసించారు. పెట్టిన లక్ష్యాన్ని కాపాడుకోగలిగారని తెలిపారు.

Advertisement

ఇది ఇలా ఉండగా నిన్నటి మ్యాచ్ సందర్భంగా వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సెంచరీ చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని పెట్టాడు. 20 ఓవర్లలో 247 పరుగులు సాధించింది విండీస్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 223 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది. దీంతో 24 పరుగులు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీం ఇండియాకు ఉప్పల్ స్టేడియంలో టి20లలో ఒక్క ఓటమి లేదు. కానీ నిన్నటి మ్యాచ్ లో తొలి ఓటమి ఎదురైంది.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

టీమిండియాను ఓడించి, గంభీర్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చా !

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×