Vijay Deverakonada: టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonada). ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర చేసి వెలుగులోకి వచ్చాడు. తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండకు భారీ పాపులారిటీ అందివ్వడమే కాదు అమ్మాయిలలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను అందించింది. ఇందులో ఉండే సన్నివేశాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
రష్మిక తో ఎఫైర్..
ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న (Rashmika Mandanna) తో కలిసి ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాలు చేశారు. ‘గీతా గోవిందం’ సినిమాలో వీరి ఆన్ స్క్రీం కెమిస్ట్రీ పూర్తిగా హైలెట్ అయింది. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు తగ్గట్టుగా వీరు కూడా వెకేషన్స్ కి వెళ్లడం, రష్మిక ఎప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడం, అన్నీ కూడా రూమర్స్ కి బలాన్ని ఇచ్చాయి. దీనికి తోడు సినిమా ఫంక్షన్స్ లో కూడా విజయ్ నా ఫ్యామిలీ అంటూ ఈమె కామెంట్లు చేసింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఎప్పుడూ కూడా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు రివీల్ అవ్వలేదు.
అబ్బాయిలూ కాస్త ఓపిక పట్టండి..
కానీ తాజాగా విజయ్ దేవరకొండ ప్రేమ గురించి కొన్ని కామెంట్స్ చేయడం వైరల్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..” ప్రేమ అనేది తప్పక పుడుతుంది. అబ్బాయిలు మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. కాబట్టి ఇంకాస్త సమయం ఇవ్వండి. అబ్బాయిలు అన్నిటికంటే ముందు జీవితంలోనే కాదు ఆలోచన విధానంలో కూడా ఎదగడం నేర్చుకోవాలి. ఇదేం చెడ్డ విషయం ఏమీ కాదు కదా.. అందుకే ప్రేమ అనే ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టాలి అంటే, కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన పురుషులు, 20 సంవత్సరాల వయసు ఉన్న వారి కంటే కూడా బెటర్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది నా స్వీయ అనుభవం. 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నప్పుడు ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఏది కూడా డిసైడ్ చేసుకోలేము. సమయం కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా ఎదురు చూడాలి. సమయమే మిమ్మల్ని మరో అడుగు ముందుకు వేసేలా చేస్తుంది. దేనిని కూడా ఫోర్స్ చేయకండి” అంటూ తెలిపాడు విజయ్ దేవరకొండ.
రష్మిక తో లవ్ కన్ఫామ్ చేసినట్టేనా..
మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక తో లవ్ లో ఉండడం వల్లే ఇలాంటి కామెంట్లు చేశారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.