Swiggy Delivery Incident: విశాఖ స్విగ్గీ బాయ్ దాడి వివాదంలో అనేక ట్విస్టులు, అనుమానాలు రేకెతిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్… ఫ్లాట్ ఓనర్‌ని బ్రో అని పిలవడంతో విచక్షణ రహితంగా కొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే ఇష్యూపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్టులు తెరపైకి వచ్చాయి. డెలివరీ బాయ్ ఇచ్చిన కంప్లైంట్‌లో ఉన్న విషయం వేరు… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు. మొత్తానికి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్‌పై సీతమ్మధార పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఫుడ్ డెలివరీకి ఇవ్వడానికి వచ్చిన అనిల్ బాడీపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ అనిల్‌పై ఆక్సిజన్ టవర్స్‌లో పనిచేసే మౌనిక ఫిర్యాదు చేసింది. ఫుడ్ డెలివరీ ఇస్తూ తన చేయి పట్టుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు డెలివరీ ఇవ్వడానికి వెళ్తే.. తాను పనిమనిషి మౌనికతో తప్పుగా మాట్లాడానని ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ తనపై దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు అనిల్. తన ఒంటిపై దుస్తులు తొలగించి.. కులం పేరుతో దూషించినట్లు అనిల్ ఆరోపిస్తున్నాడు. ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే తాను తప్పు చేశానని.. ఒప్పుకున్నట్లు తనతో బలవంతంగా లేఖ రాయించుకున్నారని ఫిర్యాదులో చెప్పడం.
ఇక అనిల్ ఫిర్యాదుతో ఫ్లాట్ ఓనర్ ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేశారు. అయితే పనిమనిషికి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు.. అనుచితంగా ప్రవర్తించాడంటూ అంటూ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ చెబుతున్నారు. ఇటు డెలివరీ బాయ్ అనిల్ రాసిన లెటర్ పోలీసులకు అందింది. అందులో తాను పనిమనిషితో అసభ్యంగా ప్రవర్తించానని ఒప్పుకున్నట్లు తనని క్షమించాలని అనిల్ లేఖ రాశాడు. దీంతో ఈ కేసు ట్రయాంగిల్‌గా మారింది. డెలివరీ బాయ్, పనిమనిషి మౌనిక, ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ ముగ్గురు.. వేరు వేరు వెర్షన్స్‌లో కంప్లైంట్స్ ఇచ్చారు. దీంతో కేసును ఏ స్టైల్లో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న కన్ఫ్యూజన్‌లో పడిపోయారు పోలీసులు. సో మొత్తానికి డెలివరీ బాయ్‌పై దాడి కేసులో అనేక ట్విస్టులు, సస్పెన్స్, థ్రిల్లింగ్ మధ్య ఎంక్వైరీ జరుగుతోంది. మరి పోలీసులు ఆఖరికి ఏం తెలుస్తారో చూడాలి.
Also Read: మాల్స్‌లో ఇకపై ఉచితంగా పార్కింగ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో రెండు వర్గాలు పోటాపోటీగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేస్తున్నాయి. ఆందోళన జరిగిన రోజు నుంచి డెలివరీ బాయ్ అనిల్ కనిపించడం లేదు. అయితే అతను గాజువాకలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. పరస్పర ఫిర్యాదులు చేసుకున్న తర్వాత.. దాడి ఘటనలో తానే తప్పుచేశానని.. క్షమించమని కోరుతూ అనిల్ లేఖ రాశాడు. దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఆక్సిజన్ టవర్స్‌కు వెళ్లగా.. సీసీ ఫుటేజ్ మాయం అయినట్లు తెలిపారు. డెలివరీ బాయ్, ప్లాట్ యజమాని ప్రసాద్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.