BigTV English

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయా? స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ లేనట్టేనా? కార్మికులు, రాజకీయ నేతల పోరాటానికి ఫలితం దక్కినట్టేనా? స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తుందా? అవుననే సంకేతాలు కేంద్రం నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.


ముడి సరుకు కొరతతో విశాఖ స్టీల్‌ప్లాంట్ కష్టనష్టాలను ఎదుర్కొంటోంది. ఒకానొక దశలో ప్రైవేటు పరం చేయడానికి మోదీ సర్కార్ పావులు కదిపింది కూడా. కాకపోతే కార్మికులు, రాజకీయ నేతలు ఆందోళనలు, ఎన్నికలు రావడంతో ఆ విషయం సైలెంట్ అయ్యింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వారంలో రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసేందుకు కేంద్రం మంతనాలు చేస్తున్నట్లు అందులోని సారాంశం. ఒక విధంగా కార్మికులకు బిగ్ రిలీఫ్ అన్నమాట. ఒక మిలియన్ ఉక్కు ఉత్పత్తి చేయాలంటే సెయిల్‌కు దాదాపు ఐదు నుంచి ఏడేళ్ల వరకు పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేస్తే కేంద్రం నిర్థేశించిన టార్గెట్‌కు చేరుకోవచ్చన్నది ప్రభుత్వం అంచనా.


ఈ క్రమంలో సెయిల్‌లో వైజాగ్ స్టీల్‌ను విలీనం చేస్తే బాగుంటుందనేది చర్చ. ప్రస్తుతం సెయిల్ వద్ద 200 ఏళ్లకు సరిపడిన ముడి సరుకు సంబంధించిన గనులున్నాయి. విశాఖ స్టీల్‌ను విలీనం చేస్తే ముడి సరకు కొరత తీరుతుందని ఉత్పత్తి కూడా పెరిగే అవకాశముందని లెక్కలు వేస్తోంది. వాటిని వినియోగించు కుంటే ఉత్పత్తి పెరగడమే కాదు, వివిధ సంస్థల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చేసి లాభాల్లోకి రావచ్చన్నది అధికారులు మాట.

ALSO READ: ఏపీలో కూటమి వచ్చాక.. జైలుకు వెంకట్‌రెడ్డి, వణుకుతున్న వైసీపీ పెద్దలు

ఒకవేళ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం జరిగితే దానికి సంబంధించిన భూములను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి. కంపెనీకి వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ప్లాంటు భూములు విక్రయం అంశాన్ని పరిశీలిస్తోందట కేంద్రం.

సౌత్‌లో సెయిల్‌కు పెద్దగా మార్కెటింగ్ వ్యవస్థ లేదు. స్టీల్‌ప్లాంట్‌ను టేకోవర్ చేసుకుంటే.. విశాఖ నుంచి వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసేందుకు పోర్టులు సైతం ఇక్కడ ఉన్నాయి. ఇది సెయిల్‌కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు విశాఖ స్టీల్ అధికారులు. మొత్తానికి వచ్చే బడ్జెట్‌లోపు స్టీల్‌ప్లాంట్ అంశం ఓ కొలిక్కి రావచ్చని అంచనా వేస్తున్నారు

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×