BigTV English

Cyclone Dana :ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్

Cyclone Dana :ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్

Cyclone Dana : ఈశాన్య రుతుపవనాలు యాక్టివ్‌గా కదులుతున్నాయి. తమిళనాడు తోపాటు ఏపీని వదలనంటున్నాయి వర్షాలు. ఏపీకి మరో అల్పపీడనం పొంచి వుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


ప్రస్తుతం ఉత్తర అండమాన్‌పై అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఎల్లుండి ఇది తుపాన్‌గా మారనుంది. ఈ తుపానుకు ‘దానా’గా నామకరణం చేయనుంది ఐఎండీ.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 24న ఒడిశా, బెంగాల్‌ తీరానికి తాకనుంది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. 24, 25 తేదీల్లో ఉత్తర కోస్తాకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం చెబుతున్నమాట.


మరోవైపు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచన చేసింది. ఏపీలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.

ALSO READ: జగన్ రాయబారం సక్సెస్! చెల్లికి సగ భాగం ఇచ్చేందుకు ఓకేనా?

ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షం పడే అవకాశముందని తెలిపింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలిపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని సూచించింది.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×