BigTV English

YS Jagan: రివర్స్ గేర్‌లో దూసుకుపోతున్న వైసీపీ.. అయోమయంలో జగన్

YS Jagan: రివర్స్ గేర్‌లో దూసుకుపోతున్న వైసీపీ.. అయోమయంలో జగన్

What is the future of YSRCP in Andhra Pradesh: అసలే దారుణ ఓటమితో కుంగిపోతున్న ఫ్యాన్‌ పార్టీకి.. నేతల వలసలతో రెక్కలు విరిగిపోతున్నాయి. వరుస షాక్‌లతో ఫ్యాన్‌ విలవిల్లాడిపోతోంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. వైసీపీ నేతలంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నారు. ఇంకొంతమంది వైసీపీకి భవిష్యత్‌ లేదని ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారు. మరోవైపు అధినేత నుంచి ఎలాంటి బుజ్జగింపులు, భరోసాలు లేకపోవడంతో ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. అటు సీనియర్లు కూడా సైలెంట్‌ అయిపోవడంతో.. అసలు వైసీపీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా తయారైంది.


ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటూ అప్పుడప్పుడు జగన్ జనంలో కనిపిస్తున్నారు. అయితే ఆ పార్టీకి షాక్‌లు మాత్రం తప్పడం లేదు. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 2019లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అద్భుత విజయం సాధించింది. దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకుంది. కానీ ఐదేళ్లు తిరిగేసరికి దానికి మించి ఓటమితో మరోసారి దేశంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

భారీ ఓటమితో పార్టీలో వైఫల్యాలు సైతం బయటపడుతున్నాయి. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలంతా వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఓటమి పాలవ్వగానే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన కార్యాలయానికి ఉన్న జగన్ ఫ్లెక్సీలను పీకి పక్కన పడేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీకి దూరమయ్యారు. ఫలితాలు వచ్చిన వెంటనే పలువురు సీనియర్లు, మాజీ మంత్రులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేపోమాపో విశాఖ కౌన్సిల్ పాలకవర్గం కూడా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది.


Also Read: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు

ఇటు పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండెం దొరబాబు కూడా వైసీపీని వీడారు. 2019 ఎన్నికల్లో ఇదే సీటు నుంచి గెలిచారు పెండెం దొరబాబు కానీ దొరబాబును పక్కన పెట్టిన జగన్‌.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను తెరపైకి తెచ్చారు. అయితే ఐదేళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ కోసం కష్టపడితే.. తనను పక్కన పెట్టడాన్ని దొరబాబు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లోనే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అవైసీపీలోనే కొనసాగారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు దొరబాబు. దొరబాబుతోపాటు మరికొంతమంది వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.

ఇటు అనంతపురం జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఈ తరుణంలో అక్కడ పార్టీకి అండగా నిలిచేవారు కరువయ్యారు. ఈ తరుణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నా.. వేరే పార్టీలో చేరేందుకే ఆయన రాజీనామా బాట పట్టినట్లు ప్రచారం జరుగుతోంది.  ఇక తాజాగా ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

ఈ పరిస్థితికి తోడు మొన్న విజయసాయిరెడ్డి, తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లు పార్టీకి పెద్ద తలనొప్పలుగా తయారయ్యాయి. మొత్తానికైతే ఇలా నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం, విశాఖ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు , పార్టీ నేతల భాగోతాలపై ఆరోపణలు.. వైసిపికి షాకింగ్ ఇచ్చే పరిణామాలే. ఇంత జరుగుతూ.. పార్టీ డ్యామేజ్‌ అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్‌ మాత్రం నోరు మెదపడం లేదు. ఎప్పటిలానే బెంగళూరు వెళ్లిపోయారు. కనీసం నేతలను పిలిచి బుజ్జగిస్తూ, భరోసాలు కూడా ఇవ్వకపోతుండటంతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీలో క్యాడర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Related News

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

AP Govt: ఏపీలో సందడే సందడి.. ఇల్లు కట్టుకునేవారికి పండగే, ఇంకెందుకు ఆలస్యం

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Srisailam Karthika Masam: శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాల.. ఆ రోజే కోటి దీపోత్సవం.!

Medical Colleges: ఇది మామూలు పోలిక కాదు.. ఉతికి ఆరేశారంతే

Bhumana – TTD: దొరికిపోయిన భూమన.. అలిపిరి ఆరోపణపై టీటీడీ రియాక్షన్ ఇదే!

Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అలిపిరి మార్గంలో నిర్లక్ష్యం

Big Stories

×