BigTV English

AP Politics : వై నాట్ 175.. అభివృద్ధి అజెండా.. ఒక్క ఛాన్స్ .. ఏపీ ఓటర్లు ఎటు వైపు?

AP Politics : వై నాట్ 175.. అభివృద్ధి అజెండా.. ఒక్క ఛాన్స్ .. ఏపీ ఓటర్లు ఎటు వైపు?


AP Politics : ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అప్పుడే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార వైఎస్ఆర్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యం అంటోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరసగా నియోజకవర్గాల సమీక్షలు చేపడుతున్నారు. ఈ సమీక్షలోనే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మూడేన్నర ఏళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్ని సీఎం జగన్ అందుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తామని సీఎం జగన్ విశ్వాసంతో ఉన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య దూకుడు పెంచారు. ఇటీవల నందిగామలో పర్యటించారు. ఆ సమయంలో తనపై రాళ్లదాడి జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటన చేపట్టారు. అక్కడ కొందరు నేతలు ఫ్లకార్డు ప్రదర్శిస్తూ చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే టీడీపీ అధినేత దూకుడుగానే ముందుకెళుతున్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో ఏపీ వెనుకబడుతోందని విమర్శించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు. సెంటిమెంట్ డైలాగ్ లు వదులుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీని ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని తేల్చేశారు. ఈ డైలాగ్ తో టీడీపీని గెలిపించుకోవాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు బలమైన సందేశం ఇచ్చారు.


అటు జనసేనాని పవన్ కల్యాణ్ నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జనవాణి కార్యక్రమం పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు అనే మరో కార్యక్రమాన్ని జనసేనాని చేపట్టారు. విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీని సందర్శించిన పవన్ కల్యాణ్…లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్లను నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. జనసేనకు అధికారమిస్తే అభివృద్ధి ఎలాగ ఉంటుందో చూపిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయమని వైఎస్ఆర్ సీపీ విశ్వాసంతో ఉంది. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన వారందరూ తమకే ఓటేస్తారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ ఎన్నికల శంఖారావాన్ని ఇప్పటికే పూరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబుడులు రావాలంటే తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏపీ అభివృద్ధి నినాదంతో చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు చంద్రబాబు. అందుకే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ప్రజల్లో తిరుగుతున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అటు తండ్రి, ఇటు తనయుడు ఎన్నికల వరకు ప్రజల్లో తిరిగాలని భావిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికారాన్ని కోరుతున్నారు. ఇలా 3 పార్టీల కార్యకలాపాలతో ఏపీ రాజకీయాలు వేడెక్కిపోయాయి. మరి ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×