YCP Party: ఏపీలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం హైలెట్ గా నిలుస్తోంది. అయితే ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కోటికి పైగా సభ్యత్వ నమోదు సాగడంతో ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. అలాగే జనసేన కూడ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం మీద టీడీపీ, జనసేన పార్టీలు రోజురోజుకు రాష్ట్రంలో మరింత బలాన్ని పెంచుకుంటున్నాయి. వైసీపీ మాత్రం నిర్లిప్తత పాటిస్తోంది. మాజీ సీఎం జగన్ మాత్రం జనవరి నెలాఖరు నుండి జనంలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇక్కడే వైసీపీ క్యాడర్ కు ఓ ప్రశ్న వేధిస్తోందట. అదేమిటంటే?
టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత నారా లోకేష్ పార్టీ భాద్యతలు కూడ చూసుకుంటున్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ పార్టీ కార్యకలాపాలు చూసుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఈ రెండు పార్టీలలో నెంబర్ – 2 ప్రశ్నకు ఆన్సర్ కూడ దొరికేస్తుంది. కానీ వైసీపీలో ఆ మాత్రం లీడర్ ఎవరని ప్రశ్న లేవనెత్తుతున్నారట క్యాడర్. అధికారంలో ఉన్నంత వరకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా పెద్ద జాబితానే ఉండేది. పార్టీలోని క్యాడర్ కు వీరు అందుబాటులో ఉంటూ సమస్యలను చక్కదిద్దేవారు.
కానీ ఎన్నికలలో 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో, క్యాడర్ కొంత నిరాశకు గురైంది. మళ్లీ పరిస్థితులను చక్కదిద్దే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాల క్యాడర్ తో జగన్ సమావేశాలు నిర్వహించారు. ఇలా సమావేశాలు నిర్వహిస్తుండగానే పార్టీకి చెందిన పలువురు నాయకులు గుడ్ బై చెప్పి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలలో చేరారు. ఇలా నాయకుల జంప్ తో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అందుకే జనంలోకి జగన్ రావాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా పార్టీ క్యాడర్ కు అండగా నిలవాలన్న లక్ష్యంతో జగన్ జిల్లాల టూర్ కు ప్లాన్ చేశారు. ఇక్కడే క్యాడర్ మధ్య ఓ ప్రశ్న వస్తోందట. ప్రతి విషయాన్ని నేరుగా జగన్ కు చెప్పలేని పరిస్థితి. అటువంటి స్థితిలో నెంబర్ – 2 లీడర్ ఉంటే తమ సమస్యలు చెప్పుకొనే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయం బాహాటంగానే కొందరు నేతలు అంటున్నారట.
Also Read: AP Schemes: ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఆ పథకాలకు గ్రీన్ సిగ్నల్?
అధికారంలో ఉన్నంత వరకు నెంబర్ – 2 నేనంటే నేనని కనిపించేవారని, ఇప్పుడు వారందరూ ఎక్కడ అంటూ కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారట. టీడీపీ, జనసేన పార్టీలలో నెంబర్ – 2 కు దిగులు లేదని, వారే పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితి చక్కదిద్దుతున్నారు. కానీ వైసీపీలో నెంబర్ – 2 ఇప్పుడు ఎవరన్నది పెద్ద చర్చగా సాగుతోంది. ఇంతకు ఆస్థానం భర్తీ అయ్యేనా? క్యాడర్ కు అందుబాటులో ఉండేనా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.