Jammu Kashmir Cloud Burst: జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. రాంబన్‌లో నాలా ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు మిస్సింగ్ అయ్యారు. కొన్నిచోట్ల రోడ్లు తెగిపోయాయి. సుమారు 350 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండ్రోజుల క్రితం వర్షం చిన్నగా మొదలైంది. శనివారం అర్ధరాత్రి దాటాక జడివానగా మారింది. పైగా గాలిదుమారంతో చెట్లు, కరెంట్ స్తంబాలు విరిగిపడ్డాయి. చిమ్మని చీకటి, పైగా ఉరుములు, మెరుపులతో.. ఎటు వెళ్లాలో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇంతస్థాయిలో వరదలు రావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.
విపరీతంగా వీచిన ఈదురుగాలులు, జోరుగా కురిసిన వర్షం ప్రభావానికి.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. 250 కిలోమీటర్ల పొడవైన.. ఈ జాతీయ రహదారిపై కొన్ని వందల వాహనాలు చిక్కుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు, ఇళ్లు కూరుకుపోయాయి.
రెస్క్యూ ఆపరేషన్‌కు వర్షాలు అడ్డంకిగా మారాయి. కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. వరద కూడా తగ్గలేదు. దాంతో సహాయక బృందాలకు ఛాలెంజ్‌గా మారింది. రాంబన్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా వరదే. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో.. రోడ్లపై మట్టి పేరుకుపోయింది. బురదలో వాహనాలు చిక్కుకుకున్నాయి. ముందుకు కదల్లేవు, వెనక్కి వెళ్లలేవు. రోడ్డుపై వాహనాలు చిక్కుకోవడం, మళ్లీ కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో జమ్మూ, శ్రీనగర్ హైవేను తాత్కాలికంగా మూసివేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వరదలు చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని ముంచెత్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇళ్లు వాహనాలు కొట్టుకుపోయాయని.. ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయ బృందాలు శ్రమిస్తున్నాయని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. డిప్యూటీ కమిషనర్ బషీర్-ఉల్-హక్ చౌదరితో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఆర్థిక, ఇతర సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు.
Also Read: ఎన్నోసార్లు గర్భం తీయించుకుంది.. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
వరదలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. జిల్లా అధికారులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యలపై ఆరా తీసినట్లు తెలిపారు. మంచినీళ్లు, ఆహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇటు సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని సూచించారాయన, అవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
The 4 lane construction work on National Highway 44 in the Ramban section Jammu and Kashmir started on Feb 2020, and is still going on. The project includes 29 km of road, 6 tunnels, 6 major bridges, and 21 minor bridges.
The area faces frequent landslides due to weak geology,… pic.twitter.com/Rn8CxQZDxk
— 🇮🇳 Amαr (@Amarrrrz) April 20, 2025