BigTV English

Jagan In Tenali: జగన్ రాంగ్ రూట్? వాళ్లు నేరస్తులని తెలిసి కూడా పబ్లిక్‌గా సపోర్ట్ ఎందుకు?

Jagan In Tenali: జగన్ రాంగ్ రూట్? వాళ్లు నేరస్తులని తెలిసి కూడా పబ్లిక్‌గా సపోర్ట్ ఎందుకు?

రెడ్ బుక్, రెడ్ బుక్ అనుకుంటూ.. జగన్ పూర్తిగా ఆ మాయలో పడిపోయి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నట్టుంది. తాజాగా ఆయన తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు, వారిని ఓదార్చారు. తెనాలిలో జాన్ విక్టర్ కుటుంబాన్ని కలసి, పరామర్శించిన అనంతరం మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులతో కావాలనే ఆ యువకులను కొట్టించారని, ప్రభుత్వం తప్పు చేసిందంటూ ధ్వజమెత్తారు.


ఆ ముగ్గురు ఎవరు..?
తెనాలిలో ఇటీవల పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులను లాఠీలతో చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటన బయటకొచ్చాక భిన్నరకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఆ యువకులు ఎలాంటి తప్పయినా చేయొచ్చు, కానీ పోలీసులకు వారిని బహిరంగంగా కొట్టే హక్కు లేదని కొంతమంది సామాజి ఉద్యమ నాయకులు వాదించారు. మరికొందరు వారు చేసిన తప్పుకి అలా బహిరంగంగా కొట్టడమే సరైన పని అని సమర్థించారు. ఇంకొందరు ఇక్కడ సామాజిక కోణం వెదికారు. వారిలో దళితులు ఉన్నారని. వారిని కొట్టడం సామాజిక న్యాయమేనా అన్నారు. సహజంగానా వేసీపీ ఈ ఘటనలో రెడ్ బుక్ ని తీసుకొచ్చంది. ఇక్కడ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారిలో ఎవరూ బుద్ధిమంతులు లేరు. పక్కా పోకిరీలు. వారిపై పాత కేసులు చాలానే ఉన్నాయి. అవి కూడా వైసీపీ హయాంలో నమోదయ్యాయి. ఆ కేసులకు ఈ ఘటనకు సంబంధమే లేదు. కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారనే కారణంతో ఆ ముగ్గురిని పోలీసులు చితక్కొట్టారు. ఆ తర్వాత రిమాండ్ కి పంపించారు. ఇక్కడ జగన్ ఓ లాజిక్ తీస్తున్నారు. తప్పు చేసినా సరే వారిని శిక్షించే అధికారం పోలీసులకు లేదంటున్నారు. పాత కేసులు ఉన్నంత మాత్రాన వారిని మరోసారి తప్పుడు కేసుల్లో ఇరికిస్తారా అంటున్నారు. తాజాగా తెనాలిలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.

జగన్ పరామర్శ వ్యవహారం వైసీపీని సమర్థించే వారికి కూడా నచ్చడం లేదంటే అతిశయోక్తి కాదు. తటస్థులు ఈ విషయంలో జగన్ కి చురకలంటిస్తున్నారు. నేరస్తులకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న జగన్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అంటే ఈ ఘటనతో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు స్పష్టమవుతోంది.

సాక్షాత్తూ హోం మంత్రి అనిత కూడా ఈ విషయంపై స్పందించారు. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. దళితులకు అన్యాయం జరిగిందని అందుకే పరామర్శించడానికి వస్తున్నానని చెప్పుకుంటున్న జగన్, తన హయాంలో దళితులను తప్పుడు కేసుల్లో ఇరికించి ఎందుకు హింసించాలని నిలదీస్తున్నారు. అప్పుడెందుకు జగన్ పరామర్శలకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.

గంజాయి మామ..
జగన్ పరామర్శ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురు పాత నేరస్తులపై గంజాయి కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో టీడీపీ గంజాయి మామ అంటూ జగన్ పై ఓ ఎపిసోడే నడుపుతోంది. గంజాయి మామను స్థానికులు అడ్డుకున్నారంటూ వీడియోలు పోస్ట్ చేస్తోంది టీడీపీ.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ తో వైసీపీకి ఏమైనా లాభం ఉంటుందేమో తెలియదు కానీ, వ్యక్తిగతంగా జగన్ ని అభిమానించే కొంతమంది కూడా ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. గంజాయి బ్యాచ్ కి జగన్ మద్దతేంటని లాజిక్ తీస్తున్నారు. నేరస్తులను కూడా సామాజిక వర్గాల వారీగా చూడాల్సిన దౌర్భాగ్యం జగన్ కి పట్టడమేంటని మండిపడుతున్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×