BigTV English

Allu Arjun: అల్లు అర్జున్ కి షాక్.. విచారణ వాయిదా..!

Allu Arjun: అల్లు అర్జున్ కి షాక్.. విచారణ వాయిదా..!

Allu Arjun:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun).. పుష్ప(Pushpa)సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డారు. అలా ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలైంది. అయితే అల్లు అర్జున్ కష్టానికి సినిమా ద్వారా ప్రతిఫలం లభించింది. కానీ సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలో రేవతి అనే మహిళ మరణించడమే కాకుండా ఆమె కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు మరోవైపు సంధ్యా థియేటర్ వద్దకు పోలీసుల పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించడం ఆయన చేసిన తప్పిదం నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఆయన ప్రైవేట్ బౌన్సర్ లు పబ్లిక్ పై దాడి చేయడంతో అల్లు అర్జున్ పై పూర్తి వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా పబ్లిక్ లో ర్యాలీ నిర్వహించుకుంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి వెళ్లిన కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.


విచారణ వాయిదా వేసిన కోర్ట్..

ఇకపోతే నాంపల్లి కోర్టులో విచారణ నిర్వహించగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. కానీ హైకోర్టులో ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేయడంతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ లభించింది. కానీ అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈరోజు నాంపల్లి కోర్ట్ లో జరిగింది. వీడియో కాన్ఫిరెన్స్ లో విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల అనగా 2025 జనవరి 10వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇక ఈరోజు ఎలాగైనా కోర్టు తీర్పు ఇస్తుందని, బెయిల్ వస్తుందని ఆశించిన అల్లు అర్జున్ కి కాస్త షాక్ తగిలిందని చెప్పవచ్చు. మరి వచ్చే నెల జరిగే విచారణలోనైనా ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఆ తప్పే బన్నీని వెంటాడుతోందా..

సాధారణంగా పబ్లిక్ ఫిగర్స్ జనాల్లోకి వస్తున్నారంటే.. పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేస్తారు. అయితే సెలబ్రిటీలు కూడా పబ్లిక్ లోకి వచ్చే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ వారు నిరాకరించారు అంటే దానికి కట్టుబడి ఉండాలి. వ్యతిరేకిస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక హైదరాబాదు సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో కి బన్నీ ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చారు. దీనికోసం పోలీసులను పర్మిషన్ అడిగినా వారు నిరాకరించినట్లు సమాచారం. నిరాకరించినా సరే అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించుకుంటూ రావడం, దాంతో అభిమానులు అల్లు అర్జున్ ని చూడడానికి ఎగబడడం, దీనికి తోడు ఆయన ప్రైవేటు బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తూ పెద్దపెద్ద కర్రలతో పబ్లిక్ పై దాడి చేశారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక నాడు పోలీసులు చెప్పిన మాట ప్రకారం అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించకుండా కామ్ గా కారులో వచ్చి సినిమా చూసి వెళ్లింటే, ఇంత జరిగేది కాదు అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×