BigTV English

YCP 5th List : వైసీపీ 5వ లిస్ట్ విడుదల.. సిట్టింగులకు మళ్లీ మొండిచేయి..

YCP 5th List : వైసీపీ 5వ లిస్ట్ విడుదల.. సిట్టింగులకు మళ్లీ మొండిచేయి..
AP Political news

YCP MLA Candidates list 5th list(AP political news):

వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఐదో జాబితాను విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో ఐదో జాబితాను మంత్రి బొత్స ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా చలమలశెట్టి సునీల్‌ పేరును ఖరారు చేశారు. తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గ ​ఇంఛార్జ్‌గా మద్దెల గురుమూర్తి పేరును ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సింహాద్రి రమేష్‌ బాబుకు అవకాశం కల్పించారు. ఇక నరసరావుపేట పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్ పేరును ప్రకటించారు.


ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. అరకు అసెంబ్లీ స్థానానికి ఇంఛార్జ్‌గా ​ రేగం మత్స్యలింగం, సత్యవేడు అసెంబ్లీ నియోజకర్గ ఇంఛార్జ్‌గా నూకతోటి రాజేష్‌, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు. ఈ ఐదో జాబితాలో వైసీపీ అధిష్టానం ముగ్గురు కొత్తవారికి చోటు కల్పించింది.

వైసీపీలో ప్రతీ జాబితాలోనూ కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. అధిష్టానం సిట్టింగ్‌లకి మొండిచేయి చూపిస్తుంది. దీంతో.. కొత్త జాబితా విడుదలైన ప్రతీసారి అసంతృప్తుల జాబితా పెరుగుతుంది. ఎక్కడికక్కడ అసమ్మతి నేతలు అధిష్టానంపై పెదవి విరుస్తున్నారు. పైగా నామినేషన్ చివిరి రోజు వరకు మార్పులు చేర్పులు ఉంటాయని బొత్స నిన్న చెప్పారు. దీంతో.. వైసీపీ నేతలు ఆయోమయంలో పడుతున్నారు.


.

.

Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×