Big Stories

Jharkhand New CM : ఝార్ఖండ్ సీఎంగా అనామక ఎమ్మెల్యే..!

Jharkhand New CM

Jharkhand New CM(India today news) :

మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వచ్చినా.. చివరికి బుధవారం అనూహ్యంగా చంపయీ సోరెన్ పేరు తెరమీదకు వచ్చింది. పార్టీ నేతలంతా లెజిస్లేచర్ పార్టీ నేతగా చంపయీ సోరెన్‌ పేరును గవర్నర్‌కు నివేదించారు. 43 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు పార్టీ వర్గాలు సమర్పించాయి. అయితే.. ప్రమాణ స్వీకారం ఏ తేదీన ఉంటుందో గవర్నర్ త్వరలో వెల్లడించనున్నారు.

- Advertisement -

సరాయ్‌కెలా ఖర్‌సాంవా జిల్లా గమ్హారియాలోని జిలింగ్‌గోఢాకు చెందిన చంపయి సోరెన్ రైతు కుటుంబానికి చెందినవారు. 11 నవంబర్ 1956లో జన్మించిన చంపయీ సోరెన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రులకు కలిగిన ఆరుగురు సంతానంలో చంపయీ సోరెన్ మూడోవారు. తల్లి గృహిణి. చిన్న వయసులోనే ఈయనకు పెళ్లైంది. చంపయూకి ఏడుగురు సంతానం. 1991లో సరాయ్‌కెలా ఉప ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారిగా విజయం సాధించినా, 2000 ఎన్నికల్లో ఓడిపోయారు. ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం నాటి నుంచి శిబు సోరెన్‌తో ఆయనకు అనుబంధం ఉంది. 2005 నుంచి వరుసగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆరుసార్లు వరుసగా గెలుపొందారు. మొన్నటివరకు హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, ఆహార సరఫరాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.

- Advertisement -

కాళ్లకు చెప్పులు, లూజుగా ఉండే కుర్తా పైజామా, తెల్లని జుట్టుతో సాధారణ వ్యక్తిలా జనంలో తిరిగే చంపయీ ఎవరికి కష్టమొచ్చినా, సోషల్ మీడియాలో ఆ వివరాలు పోస్ట్ చేసి, సంబంధిత శాఖను ట్యాగ్ చేసి, ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా వెంటబడతారనే పేరుంది. అయితే.. అనేక పేర్లు సీఎం పదవికి పరిశీలనకు వచ్చినా.. చివరికి 67 ఏళ్ల చంపయీ సోరెన్ ఝార్ఖండ్ సీఎం పదవికి ఎన్నిక కాబోతుండటంతో రాజకీయ వర్గాలు ఆశ్చర్యంలో మునిగిపోయాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News