BigTV English

Attack on Family: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..!

Attack on Family: విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..!

Attack on Family in Visakhapatnam for Vote to TDP: ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన చుట్టుపక్కన వాళ్లు ఆసుపత్రిలో చేర్పించారు.


ఆడవాళ్లని చూడకుండా దాడి చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బును నిరాకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని పాశవిక దాడులకు పాల్పడ్డారని అన్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలని డీజీపీని కోరారు చంద్రబాబు.

Also Read: CEO Report to EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి చేరిన నివేదిక!

అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గూండాలు ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఆడవారని చూడకుండా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.

Related News

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Amaravati ORR: అమరావతి ORRకు వేగం.. భూసేకరణ మొదలు.. ఆ నగరాలకు పండగే!

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

Anantapur News: దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. ముట్టడికి జూనియర్ ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు

Big Stories

×