WPL 2025: ఇటీవల ఐపీఎల్ 2025 వేలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2025) వచ్చే సీజన్ కి సంబంధించి వేలంపై దృష్టి సారించింది. ఈ ఏడాది డబ్ల్యూపిఎల్ 2024 టోర్నీ ఫిబ్రవరి 23వ తేదీన మొదలైంది. ఈ టోర్నీ మార్చి 17వ తేదీన ఫైనల్ జరిగింది. ఈ డబ్ల్యుపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఇక రెండవ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ సాధించింది.
Also Read: Rajat Patidar: ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా యంగ్ ప్లేయర్..?
ఇప్పుడు మూడవ సీజన్ (WPL 2025) కోసం నిర్వహకులు ఏర్పాటు చేస్తున్నారు. డబ్ల్యూపిఎల్ 2025 వేలానికి బెంగళూరు వేదిక కానుంది. వేలం డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. స్పోర్ట్స్ 18 HD/ SD లో భారతదేశంలో మహిళా ప్రీమియర్ 2025 వేలాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. ఇక జియో సినిమా wpl 2025 వేలాన్ని భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఫ్రాంచైజీల దగ్గర మిగిలిన పర్స్ ఎంతంటే..? గుజరాత్ రూ. 4.4 కోట్లు, యూపీ వారియర్స్ రూ. 3.9 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 2.65 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.5 కోట్లు.
ఇక ఏ ఫ్రాంచైజీకి ఎంతమంది అవసరం అంటే..? గుజరాత్ జేయింట్స్ – 4, ఆర్సిబి – 4, ముంబై ఇండియన్స్ – 4, యూపీ వారియర్స్ – 3. అలాగే ఏ ఫ్రాంచైజీ ఎంతమందిని రిటైన్ చేసుకుందంటే..? ముంబై ఇండియన్స్: హర్మన్ ప్రీత్ కౌర్, అమన్ జ్యోత్ కౌర్, అమేలీయ కేర్, క్లొ ట్రయాన్, హెలి మాథ్యూస్, జంతిమనీ కలిత, సైకా ఇషాక్, పూజ వస్త్రాకర్, యాస్తిక భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్దీప్ కౌర్, ఎస్ సజనా, కీర్తన బాలకృష్ణన్.
యూపీ వారియర్స్: దీప్తి శర్మ, అంజలి శర్వాణి, అలీస్సా హీలి, గ్రేన్ హరీస్, కిరణ్ నువ్ గిరే, చమరి ఆటపట్టు, రాజేశ్వరి గైక్వాడ్, శ్వేత సెహ్రవత్, సోఫీ ఎకిల్ స్టోన్, తహ్లియా మేగ్రాత్, వృందా దినేష్, పూనం ఖేమ్నార్, సైమా టాకూర్, గౌహేర్ సుల్తానా. ఢిల్లీ క్యాపిటల్స్: అరుంధతి రెడ్డి, జమీమా, జెస్ జోనాస్సేస్, మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలీస్ క్యాప్సే, మారిజెన్ కాప్, మిన్ను మని, రాధా యాదవ్, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, అన్నాబెల్ సదర్లాండ్, సాధు.
Also Read: Mohammed Shami: రోహిత్ శర్మ టార్చర్.. రిటైర్మెంట్ దిశగా షమీ..?
గుజరాత్ జైయింట్స్ : అష్లీ, బెత్ మూనీ, హార్లిన్, దయాలన్ హేమలత, లారా వోల్వార్డ్, శబ్నం షకీల్, ఫోబ్, మేఘన సింగ్, తనూజ, కశ్వి, ప్రియా, మన్నత్ కశ్యప్, సయాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మందాన, ఎస్ మేఘన, రీచా, ఎలీస్ పెర్రి, జార్జియా, శ్రయాంక, ఆశా శోభన, సోఫీ, రేణుక సింగ్, సోఫీ మెలీనిక్స్, ఏక్తా, కేట్ క్రాస్, కనిజ.