E-Paper
Advertisement

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు.. ముందస్తుగా కీలక నేతలు అరెస్ట్, జెన్ జీల జాడేది?

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు.. ముందస్తుగా కీలక నేతలు అరెస్ట్, జెన్ జీల జాడేది?
Advertisement

Amaravati: డీఎస్సీ‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తేవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? దాని పేరుతో నిరసనలు.. ర్యాలీలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోందా? ఈ ఇష్యూ ద్వారా జెన్ జీలను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసిందా? డీఎస్సీ వ్యవహారంపై కోర్టు కూడా సీబీఐ విచారణకు ససేమిరా చెప్పినా, ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? సోమవారం నిరసన ర్యాలీలో కీలక నేతలు అరెస్టుతో పెద్దగా స్పందన లేదా?

డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీలు

ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది డీఎస్సీ నిర్వహించింది. అందులో అక్రమాలు జరిగాయంటూ నిరసనలకు దిగుతోంది. వారానికి ఒక్కో పేరుతో నిరసనలు తీవ్రతరం చేస్తోంది వైసీపీ. ర్యాలీలు, నిరసనలు, శాంతియుత ప్రదర్శనలు మొదలు పెట్టింది. ఈ విషయంలో న్యాయస్థానాలను సైతం ఆశ్రయించింది. అక్కడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పరిస్థితి గమనించిన ఆ పార్టీ హైకమాండ్..  నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. అసలే జెన్ జీ ఉద్యమాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో తాము చేస్తున్న ర్యాలీలు సక్సెస్ అవుతాయని భావించింది వైసీపీ.

Advertisement

 

ఏపీ వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు

సోమవారం ఏపీ వ్యాప్తంగా ర్యాలీలకు పిలుపు ఇచ్చింది వైసీపీ. ప్లాన్ ప్రకారం నేతలంతా రోడ్డెక్కాలని భావించారు. కీలక నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి ర్యాలీలు చేపట్టారు. పెద్దగా స్పందన కనిపించలేదు. కీలక నేతలు అరెస్టుతో ర్యాలీలకు ఊపు పోయింది. ప్రజలకు అవాంతరాలు కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని తేల్చిచెబుతున్నారు పోలీసులు. ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీ అనుమతి లేదంటూ ఆయా నేతలకు నోటీసులు ఇచ్చారు.

Advertisement

 

ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటూ నేతల ప్రశ్నలు

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు నోరు విప్పారు. యువగళంలో లోకేష్ వెంట నడిచిన వారికి స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీబీఐతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. గాంధేయ పద్దతి నిరసనలు చేస్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.

ALSO READ: ముఖం చాటేస్తున్న పులస చేప.. అదేనా అసలు కారణం?

Related News

ఏపీలో ఘోరాతి ఘోరం.. నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మనువడు!

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నున్న సీఐ అలీ మృతి!

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

Big Stories

Advertisement
×