E-Paper
Advertisement

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్
Advertisement

Addanki Dayakar: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు, వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సీఎల్పీ మీడియా సెంటర్‌లో గట్టిగా విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే అమరవీరుల త్యాగాలని, కేసీఆర్ కుటుంబం కాదని స్పష్టం చేస్తూ ఆయన మాట్లాడారు.

రేవంత్ మొదటి అడుగు సిరిసిల్లే!

Advertisement

కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చామని చెప్పుకోవడం పెద్ద అబద్ధమని దయాకర్ అన్నారు. నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ఉపయోగం ఉండేది కాదు. తెలంగాణ తమ సొత్తే అని విర్రవీగిన కల్వకుంట్ల కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కారని వ్యాఖ్యానించారు. ఈ సెప్టెంబర్‌లోనే రేవంత్ రెడ్డి మొదటి అడుగు సిరిసిల్లపై, రెండో అడుగు సిద్ధిపేటపై, మూడో అడుగు గజ్వేల్‌పై పడబోతోందని, కేటీఆర్‌ను గజ్జున వణికిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కారిడార్‌ను, ఆయన బంధువులు అక్రమంగా కట్టుకున్న సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని కుండబద్దలు కొట్టారు.

వానపాముల్లా చూసినోళ్లనే కాలనాగుల్లా ఓడించాం

Advertisement

తెలంగాణ ప్రజలను వానపాముల్లా చూసిన కేటీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పి ఓడించారని చెప్పారు. ముందు తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తేల్చుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. కేసీఆర్ కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేయని కేటీఆర్, ఇంకో 20 ఏళ్లయినా అధికారంలోకి రాలేరని జోస్యం చెప్పారు. అవినీతి సొమ్ముతో తమపై విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

దళితుల భూములు గుంజుకుని ఫామ్‌హౌస్‌లు కట్టారు

దళితుడిని సీఎం చేయకపోగా, ఇందిరమ్మ ఇచ్చిన భూములను బిఆర్ఎస్ నాయకులు లాక్కున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం భూములను ఆక్రమించి కట్టుకున్న ఫామ్‌హౌస్‌ల గుట్టూ విప్పుతామన్నారు. హైడ్రా ద్వారా కోట్ల విలువైన భూములకు విముక్తి కలిగిస్తుంటే ఓర్వలేక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.

బిఆర్ఎస్, బీజేపీ ఒకే జాతి మొక్కలు

ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ కేటీఆర్ తెలంగాణ ద్రోహిలా మారాడని, తెలంగాణ ఉద్యమకారులను బిఆర్ఎస్ పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత ఉందన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని, తమ దృష్టిలో బీజేపీ, బిఆర్ఎస్ రెండూ ఒకే జాతి మొక్కలని దయాకర్ తేల్చి చెప్పారు.

Also Read: నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

Tags

Related News

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

డీసీఎం ఢీకొని ఆరు పాడి గేదెలు మృతి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×