YCP Rebel MLAs News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తన వద్ద విచారణకు గురువారం రావాలి కోరారు. కానీ తాము రాలేమని ఆ నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.
తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని ఆ నలుగురు ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. ప్రసాదరాజు సమర్పించిన వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని ఆయా సంస్థలు నుంచి.. సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాశారు.
వాస్తవానికి గురువాం మధ్యాహ్నం 3 గంటలకు మేకపాటి, కోటంరెడ్డి, ఆనం, శ్రీదేవి మౌఖికంగా తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు. గురువారం తన ఎదుట విచారణకు హాజరు కావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు మద్ధాలి గిరిధరను స్పీకర్ విచారణకు హాజరుకావాలని కోరారు. ఈ నలుగు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.
అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద ఉన్నాయి. మరి సభాపతి తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.