E-Paper
Advertisement

లైఫ్‌లో ఒక్కసారైనా ఈ చాక్లెట్ లావా కేక్ రుచి చూడాల్సిందే.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి!

లైఫ్‌లో ఒక్కసారైనా ఈ చాక్లెట్ లావా కేక్ రుచి చూడాల్సిందే.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి!
Advertisement

Chocolate Lava Cake: చాక్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా చాక్లెట్‌తో చేసిన కేకులంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి చాక్లెట్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన డెజర్ట్ చాక్లెట్ లావా కేక్. బయటకు చూస్తే మెత్తటి కేక్‌లా కనిపించే ఈ వంటకాన్ని కట్ చేయగానే లోపల నుంచి వేడివేడి చాక్లెట్ ద్రవంలా బయటకు వస్తుంది. ఆ రుచిని ఆస్వాదిస్తుంటే మరో ముక్క తినాలనిపిస్తుంది. బేకరీల్లో ఎంతో ఖరీదుగా లభించే ఈ చాక్లెట్ లావా కేక్‌ను ఇంట్లోనే కొన్ని పదార్థాలతో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా లేదా ఇంట్లో ప్రత్యేక సందర్భాల్లో అందించేందుకు రుచికరమైన చాక్లెట్ లావా కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

డార్క్ చాక్లెట్ – 100 గ్రాములు
వెన్న – 50 గ్రాములు
మైదా పిండి – ¼ కప్పు
పొడి చక్కెర – ¼ కప్పు
గుడ్లు – 2

Advertisement

Also Read: పక్కా దాబా స్టైల్ కాశ్మీరి దమ్ ఆలూ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు!
వెనిల్లా ఎసెన్స్ – ½ టీస్పూన్
ఉప్పు – చిటికెడు
కేక్ మోల్డ్స్‌కు రాసేందుకు వెన్న – కొద్దిగా
కోకో పౌడర్ – 1 టీస్పూన్

చాక్లెట్ లావా కేక్ తయారీ విధానం:

ఒక గిన్నెలో ముందుగా డార్క్ చాక్లెట్ ముక్కలు, వెన్న వేసి డబుల్ బాయిలర్ పద్ధతిలో లేదా మైక్రోవేవ్‌లో కరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో గుడ్లు, పొడి చక్కెర వేసి క్రీమీగా అయ్యే వరకు బాగా గిలకొట్టాలి. ఇందులో వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.

Advertisement

ఇప్పుడు ఈ గుడ్ల మిశ్రమంలో కరిగించిన చాక్లెట్, వెన్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. తర్వాత మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి ఉండలు లేకుండా మెల్లగా కలపాలి.

ఇప్పుడు చిన్న కేక్ మోల్డ్స్‌కు వెన్న రాసి కోకో పౌడర్ చల్లాలి. అందులో సిద్ధం చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని మూడొంతుల వరకు పోయాలి. ముందుగా 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు వేడి చేసిన ఓవెన్‌లో 8 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేయాలి.

కేక్ అంచులు గట్టిపడి మధ్య భాగం కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు బయటకు తీయాలి. రెండు నిమిషాలు చల్లారిన తర్వాత జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన చాక్లెట్ లావా కేక్ రెడీ. ఫ్రెష్‌గా ఉన్నప్పుడే కట్ చేసుకుని తింటే.. లోపలున్న చాక్లెట్ సాస్ కరిగి బయటకు వచ్చి అద్భుతమైన రుచిని అందిస్తుంది.

Also Read: సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

Tags

Related News

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

చాణక్య నీతి.. ఇలా ఆలోచించేవారు మాత్రమే ధనవంతులు అవుతారు

భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు

Big Stories

Advertisement
×