BigTV English

Jagan Ring: చేతికి కొత్త రింగ్.. చంద్రబాబు సెంటిమెంట్ ఫాలో అవుతున్న జగన్

Jagan Ring: చేతికి కొత్త రింగ్.. చంద్రబాబు సెంటిమెంట్ ఫాలో అవుతున్న జగన్

జగన్ చేతికి రింగ్ ఎప్పుడైనా చూశారా. అది బంగారపు ఉంగరం కాదు, ఒక స్మార్ట్ రింగ్. ఆగండాగండి ఈ రింగ్ ఇదివరకు ఎవరైనా పెట్టుకోవడం చూశారా..? చూసే ఉంటార్లెండి పెట్టుకోవడమే కాదు, దాని వల్ల ఉపయోగాలను కూడా సీఎం చంద్రబాబు ఓ సందర్భంలో వివరించారు. సరిగ్గా అలాంటి రింగ్ నే ఇప్పుడు జగన్ పెట్టుకున్నారు. అయితే ఏంటి అంటారా..? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


చంద్రబాబు రింగ్ స్పెషాలిటీ ఏంటి..?
చంద్రబాబు చేతికి ఓ రింగ్ ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే అది హెల్త్ మానిటర్ ఎక్విప్మెంట్. రింగ్ లాగా వేలికి పెట్టుకుంటారు. మైక్రో చిప్ సాయంతో ఇది పని చేస్తుంది. ఈ చిప్ ద్వారా ఆ రింగ్ పెట్టుకున్న వ్యక్తి రోజుకి ఎన్ని అడుగులు నడిచారు. గుండె వేగం ఎంత, బీపీ ఎంత ఉంది, ఎన్నిగంటలు పనిచేశారు, ఎన్నిగంటలు రెస్ట్ తీసుకున్నారు.. అనే విషయాలను తెలుసుకోచ్చు. చిప్ లో నిక్షిప్తం అయిన సమాచారం అంతా వెంటనే దానికి అనుసంధానమైన కంప్యూటర్ లో స్టోర్ అవుతుంది. ఒకరకంగా ఇప్పుడు కొన్ని స్మార్ట్ వాచ్ లు చేసే పని ఈ రింగ్ చేస్తుందనమాట. అయితే వాచ్ కంటే ఇది మరింత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఉంటుంది. ఈ చిప్ ద్వారా తీసుకున్న డేటాను బట్టి ఎప్పటికప్పుడు వైద్యులు చంద్రబాబుకి ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తారు. ఆరోగ్యం విషయంలో తాను చేసే తప్పిదాలను సరి చేసుకోవడానికే ఈ రింగ్ పెట్టుకున్నానంటూ గతంలో చంద్రబాబు ప్రజలకే వివరించారు. కార్యకర్తలు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.

టెక్నాలజీ..
పరిపాలనలో నూతన టెక్నాలజీని ప్రవేశ పెట్టే నాయకుడిగా చంద్రబాబుకి పేరుంది. అది కేవలం పాలనకే కాదు, తన వ్యక్తిగత విషయాలలో కూడా ఆయన టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. అందుకే హెల్త్ మానిటర్ రింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే టెక్నాలజీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జగన్ పర్యటనల్లో ఆయన చేతికి ఇలాంటి రింగ్ కనిపించింది. అయితే పార్టీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు, తనకు తానుగా జగన్ కూడా ఇది హెల్త్ మానిటరింగ్ రింగ్ అని చెప్పలేదు. అయితే దాన్ని చూసిన ఎవరైనా అది హెల్త్ మానిటర్ పరికరం అని ఈజీగా గ్రహించవచ్చు.

చంద్రబాబు రింగ్ గురించి ఆయన చెప్పక ముందు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ కి బీపీ పెరిగి ఉంటుందని, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, అందుకే హెల్త్ ట్రాక్ కోసం డాక్టర్లు ఈ రింగ్ పెట్టుకోవాలని సలహాఇచ్చి ఉంటారని టీడీపీ హ్యాండిల్స్ కౌంటర్లిస్తున్నాయి. సెటైర్ల సంగతి పక్కనపెడితే.. హెల్త్ విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండటం అభినందించదగ్గ విషయమే. నిత్యం చంద్రబాబుని విమర్శించే జగన్, ఆయన వయసుపై జోకులు వేసే జగన్.. ఇప్పుడు ఆయన్నే ఫాలో కావడం మాత్రం ఆశ్చర్యకరం.

Related News

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

AP rains alert: మోస్తారు నుండి భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త తప్పనిసరి!

Big Stories

×