Big Stories

Biggest Airport: దుబాయ్ సిగలో మరొకటి, ఇంతకీ ఏంటో తెలుసా?

Biggest new airport: దుబాయ్.. ప్రపంచంలోనే ఎత్తైన భవనాలకు కేరాఫ్ అడ్రస్. అంతేకాదు కొత్త నిర్మాణాలకూ వేదిక కాబోతోంది. ప్రపంచంలోని అన్నింటికన్నా తామే ముందు ఉండాలని భావిస్తున్నారు అక్కడి పాలకులు. తాజాగా ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలని పాలకులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి పనులు రేపో మాపో మొదలుకానున్నాయి.

- Advertisement -

ప్రపంచంలో అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుల్లో దుబాయ్ ఒకటి. దీన్ని భారీగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దుబాయ్ పాలకుడు షేఖ్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా దాదాపు 35 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు. ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు రెండు లక్షల కోట్ల పైమాటే.

- Advertisement -

నిర్మించబోయే అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రపంచంలో ఎక్కువమంది రాకపోకలు కొనసాగించేలా నిర్మించబోతున్నారు. ఏడాదికి దాదాపు 260 మిలియన్లు ప్రయాణికులు ఇక్కడి నుంచి తమతమ ప్రయాణాలు కొనసాగించవచ్చు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఎయిర్ పోర్టు కంటే ఐదురెట్లు పెద్దది. సదుపాయాలకు కొదవలేదు.

ALSO READ:  ఇరాక్ లో దారుణం.. టిక్ టాక్ స్టార్ హత్య

400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్ వేలను కలిగి ఉండనుంది. అంతేకాదు ఏవియేషన్ సెక్టార్‌లో తొలిసారి న్యూ టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించనున్నట్లు మక్తూమ్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. అంతేకాదు దక్షిణ దుబాయ్‌లో చేపడుతున్న ఈ ఎయిర్ పోర్టు చుట్టూ కొత్త సిటీ నిర్మాణం కానుంది. ముఖ్యంగా లాజిస్టిక్ కంపెనీలకు ఇది కేంద్రం కానుంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ లైన్స్‌కు దుబాయ్ డెస్టినేషన్‌గా మారడం ఖాయమని అంటున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News