BigTV English

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

BJP Vs YCP: మొన్నటి వరకు ఆ రెండు పార్టీలు దోస్తీ అనుకున్నారు.. ఎన్నికల పుణ్యమా అంటూ ఒక్కసారిగా ఆ వాతావరణం మారింది. ఆ దోస్తీ కాస్త ఆ నాయకుల మధ్య కుస్తీకి దారితీసింది. ఇప్పుడు తిరుమల లడ్డు వివాదం పుణ్యమా అంటూ ఆ రెండు పార్టీల మధ్య వార్ జరగనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకు ఆ దోస్తీ చేస్తూ కుస్తీకి పాల్పడ్డ పార్టీలు ఏవో తెలుసా.. వైసీపీ, బీజేపీ. ఎన్నికల సమయంలో బీజేపీతో ఉన్న జనసేనకు తోడు టీడీపీ సైతం కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొంత మైత్రి కొనసాగించింది వైసీపీ. ఇక మూడు పార్టీలు కూటమి కాగానే వైసీపీ సైడ్ అయ్యింది. ఎన్నికలలో కూటమి విజయాన్ని అందుకుంది. సింహం సింగిల్ అన్న వైసీపీ ఘోర ఓటమి చవి చూసింది.


ప్రస్తుతం తిరుమల లడ్డులో వినియోగించిన నెయ్యి వివాదం పుణ్యమా అంటూ ఇప్పటికే టిడిపి, జనసేనలు కలిసి వైసీపీపై ఘాటు విమర్శలు చేశాయి. వైసీపీ సైతం ఎదురుదాడికి దిగి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరాఫరా చేసే నెయ్యి కల్తీ అయిందంటూ విమర్శలు రాగా.. మాజీ సీఎం జగన్ తాను తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటన జారీ చేశారు. ఇక అంతే డిక్లరేషన్ వివాదం తెర మీదికి వచ్చింది. డిక్లరేషన్ పై సంతకం చేసిన ఆనంతరమే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించాలన్న డిమాండ్ ను కూటమి పార్టీలు వినిపించాయి. తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత అయితే ఏకంగా జగన్ రానున్న రోజే తిరుమలకు చేరుకొని, వైసీపీని ఘాటుగా విమర్శించారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా వైయస్ జగన్ తన పర్యటన రద్దు చేసుకొని మీడియా సమావేశంను నిర్వహించారు. ఇక్కడే గత సమావేశాలకు భిన్నంగా జగన్.. బీజేపీపై సైతం విమర్శలు చేశారు. సాధారణంగా టీడీపీ, జనసేన పార్టీలపైనే విమర్శలు గుప్పించే జగన్, ఈసారి బీజేపీని కూడా కలిపి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?


జగన్ మాట్లాడుతూ.. తన పర్యటనను అడ్డుకొనేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నం చేశాయని, బీజేపీ అయితే పక్క రాష్ట్ర నేతలను కూడా రంగంలోకి దించిందని ఆరోపించారు. ఈ ఒక్క మాట జగన్ పై బీజేపీ శ్రేణుల కోపానికి కారణం అయిందని చెప్పవచ్చు. మొన్నటి వరకు బీజేపీని ఒక్క మాట అనని వైయస్ జగన్.. విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఇక బీజేపీ వర్సెస్ వైసీపీ వార్ ప్రారంభం కానుందనే వాదనను రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై జగన్ కాలు దువ్వితే కేసులు తెర మీదికి వస్తాయని, ఇక వైసీపీకి చుక్కలే అంటూ మరికొందరి అభిప్రాయం. అవినీతి కేసుల్లో బెయిల్ పై ఉన్న జగన్ అంత సాహసం చేసి.. బీజేపీపై విమర్శలు ఎక్కుపెడితే వాటిని తిప్పి కొట్టేందుకు బీజేపీ శ్రేణులు సైతం సిద్దమయ్యారు. మొత్తం మీద తిరుమల లడ్డు వివాదం ఇక బీజేపీ వర్సెస్ వైసీపీగా సైతం రూట్ మార్చగా.. మున్ముందు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దం సాగడం ఖాయం అంటూ జోరుగా చర్చ సాగుతోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×