Vallabhaneni Vamsi: విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సంధర్భంగా పంకజశ్రీ సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ పంకజశ్రీ ఆరోపించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన భర్త అరెస్ట్ అయిన వెంటనే పంకజశ్రీ వస్తుండగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆమెను అనుమతించారు. ప్రస్తుతం వంశీని కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రిమాండ్ తరలించారు. దీనితో శనివారం ములాఖత్ ద్వారా భార్య పంకజశ్రీ కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. సబ్ జైలులో ఉన్న వంశీకి ప్రాణహాని ఉందన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వంశీని కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మొత్తం 60 సీసీ కెమెరాల నిఘా మధ్య తన భర్త ఉన్నారన్నారు.
కాగా వంశీ ఆరోగ్యం బాగుందంటూ వైద్యులు తప్పుడు ధృవీకరణ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ఆమె హెచ్చరించారు. జగన్ ఫోన్ చేశారా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, జగన్ ఫోన్ చేశారని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారన్నారు. అలాగే వచ్చే వారం జగన్ కలుస్తానని చెప్పారన్నారు. అనంతరం హోమ్ మంత్రిని కలిసేందుకు ఆమె ప్రయత్నించగా, మంత్రి ప్రస్తుతం అందుబాటులో లేరని సిబ్బంది తెలిపినట్లు సమాచారం.
అయితే వంశీ అరెస్ట్ పై హోమ్ మంత్రి అనిత మాట్లాడుతూ.. పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే వంశీని పోలీసులు అరెస్టు చేశారన్నారు. తాము ప్రతీకారమే తీర్చుకోవాలి అనుకుంటే ఇన్ని నెలలు ఎందుకు ఆగుతాం ? డీజీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు వీళ్లు ఎందుకు మాట్లాడలేదంటూ మంత్రి ప్రశ్నించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈరోజు మాజీ సీఎం మాట్లాడుతున్నారని, సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు వంశీపై చర్యలు తీసుకున్నారని మంత్రి అన్నారు.
మొత్తం మీద వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు వైసీపీ విమర్శలు, మరోవైపు టీడీపీ ప్రతి విమర్శల జోరు సాగుతోంది. మొత్తం మీద రెడ్ బుక్ ఓపెన్ అయిందని, అందులో వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరు అంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా వంశీని జగన్ ములాఖత్ వారంలో ఉంటుందని పంకజశ్రీ తెలుపగా, ఆతర్వాత జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: తిరుమల అన్నప్రసాదం.. విదేశీ భక్తులు ఫిదా.. ఏం చెప్పారంటే?
వంశీ ఇంట్లో సోదాలు?
వంశీని పోలీసులు విచారించిన సమయంలో మొబైల్ ఫోన్ ఎక్కడా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. కానీ అరెస్ట్ సమయంలో తన ఫోన్ ను దాచి ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో వంశీ ఉండగా, హైదరాబాద్ లోని వంశీ నివాసంలో పోలీసుల సోదాలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఈ సోదాలు కేవలం మొబైల్ ఫోన్ కోసమేనని, ఆ ఫోన్ చిక్కితే మరిన్ని ఆధారాలు పోలీసులకు చిక్కినట్లేనంటూ ప్రచారం సాగుతోంది.
విజయవాడ సబ్ జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: పంకజశ్రీ
వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు
వెన్నుపూస నొప్పితో, శ్వాసకోశ సమస్యతో ఆయన బాధ పడుతున్నారు
వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు
ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం
వైఎస్ జగన్ ఫోన్ చేశారు..… https://t.co/zE42jUWafo pic.twitter.com/ffSUku3tBX
— BIG TV Breaking News (@bigtvtelugu) February 15, 2025