BigTV English

Foreigners In Tirumala: తిరుమల అన్నప్రసాదం.. విదేశీ భక్తులు ఫిదా.. ఏం చెప్పారంటే?

Foreigners In Tirumala: తిరుమల అన్నప్రసాదం..  విదేశీ భక్తులు ఫిదా.. ఏం చెప్పారంటే?

Foreigners In Tirumala: తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం దక్కడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిరంతరం వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే తిరుమల మాడవీధులు నిరంతరం భక్తుల గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. అయితే శ్రీవారి దర్శనార్థం ఇటీవల తిరుమలకు వచ్చిన విదేశీ భక్తులు కొందరు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సంధర్భంగా వారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు లడ్డు ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే తిరుమల లడ్డుకు ప్రత్యేక పవిత్రమైన స్థానం ఉంది. తిరుమలకు వచ్చారంటే చాలు, శ్రీవారి లడ్డును ప్రసాదంగా స్వీకరించాల్సిందే. అలాగే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఉచితంగా అన్నప్రసాదాన్ని కూడా అందిస్తుంది. తిరుమలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న లక్ష్యంతో టీటీడీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి దర్శనం అనంతరం అన్నప్రసాదం స్వీకరణకు భక్తులు అమిత ఆసక్తి చూపుతారు. కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో స్వామి వారి చెంత, అన్నప్రసాదం స్వీకరించే అవకాశాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు.

భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్నప్రసాదం తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అప్పుడప్పుడు కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, టీటీడీ వాటిని కొట్టిపారేస్తూ అన్నప్రసాదం వితరణలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టింది. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయంలో అన్నప్రసాదం పై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల నుండి ఎటువంటి విమర్శలకు తావులేకుండా పకడ్బందీగా కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు, విరాళాలు కూడా అందిస్తారు.


శ్రీవారి దర్శనార్థం కేవలం భారతీయులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు. శ్రీవారిని దర్శించి గోవిందా నామాన్ని జపిస్తూ వారు తమ భక్తిని చాటుకుంటారు. ఇటీవల పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు శ్రీవారిని దర్శించారు. వారు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో పాటు వారు కూర్చొని అన్నప్రసాదం స్వీకరిస్తూ.. గోవిందా గోవిందా అంటూ తమ భక్తిని చాటుకున్నారు. ఆ విదేశీయుల భక్తికి ముచ్చటపడ్డ స్థానికులు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారా.. ఒక్క క్లిక్ తో స్టేటస్ తెలుసుకోండి

ఈ సంధర్భంగా విదేశీ భక్తులు మాట్లాడుతూ.. తమకు శ్రీవారి దర్శనభాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని, అన్నప్రసాదం రుచి అమోఘం అంటూ టీటీడీ అధికారులను వారు ప్రశంసించారు. అంతేకాకుండా టీటీడీ సిబ్బంది అందిస్తున్న సేవలు బాగున్నాయని, శ్రీవారి దర్శన సౌకర్యాలను కూడ వారు మెచ్చుకున్నారు. విదేశీ భక్తుల నుండి టీటీడీకి అభినందనలు కురిపించడంపై టీటీడీ సిబ్బంది కూడా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుండి టీటీడీకి సంబంధించి ఎన్నో నూతన విధానాలను ప్రవేశపెట్టి భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల టీటీడీలో గల పలువురు అన్యమతస్థులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×