BigTV English

YS Jagan: వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. ఇదంతా కావాలనే చేశారు

YS Jagan: వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. ఇదంతా కావాలనే చేశారు

YS Jagan: సీఎం చంద్రబాబునాయుడు రాజకీయాలను మరింత దిగజార్చారని.. తాను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నిలదీశారు. తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు..? గతంలో చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు తాము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అని తీవ్ర స్థాయిలో జగన్ ఫైరయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదిక పోస్ట్ చేశారు. 


ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్‌ హక్కు కాదా? మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్‌ రానప్పుడు మేం మీకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు.. ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది ఎవరికైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్‌ ఇది అని జగన్ అన్నారు. 

జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? జనాల రద్దీ ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం. మరి మీ పైలట్‌ వెహికల్స్‌, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్‌ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నదా? అని జగన్ ప్రశ్నించారు. 


ALSO READ: NTPC Jobs: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే భారీ జీతం, ఇంకా 2 రోజులే..

జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ సీఎంకి బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంట్‌ డ్రైవరే ఆ వాహనాన్ని నడపాలి. ఇది ప్రొటోకాల్‌. మంచి బుల్లెట్ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నాను. డ్రైవర్‌ను మీరు ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ నడుపుతున్న ఈవెహికల్‌, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్‌ అని జగన్ వివరించారు. 

ALSO READ: Tirumala News: భక్తులకు తీరిన కష్టాలు.. ఆ సమస్య పోయినట్టే

ఆరోజు ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఏమిటి? ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలు? చేస్తున్నారని నిలదీశారు. ప్రతిపక్షంగా నేను ప్రెస్‌మీట్‌ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్‌ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండని జగన్ ఫైరయ్యారు.  గతంలో చంద్రబాబు పర్యటనల సమయంలో, మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో ఏమైనా సాయం చేశారా? అని జగన్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×