Actress Anjali: మొగలిరేకులు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బుల్లితెర నటి అంజలి(Anjali). ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈమె అనంతరం పలు బులితెర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఇటీవల కాలంలో సీరియల్స్ కాస్త తగ్గించిన అంజలి బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.. ఇక ఈమె పవన్ (Pawan)అనే వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవల అంజలి తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించడం అలాగే తనకు డెలివరీ అయిందనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఘనంగా సీమంతపు వేడుక..
గత కొద్ది రోజుల క్రితం తనకు డెలివరీ అయిందని చెప్పిన అంజలి బాబు పుట్టాడ లేదా పాప పుట్టిందా అనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఇకపోతే తన భర్త పవన్ తో కలిసి అంజలి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకుంటున్నారు తాజాగా ఈమె తన రెండో సీమంతపు వేడుకలకు (Baby Shower)సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈమె డెలివరీ అయిన తర్వాత ఈ వేడుకకు సంబంధించిన వీడియోని షేర్ చేయడం గమనార్హం.
పాప లేక బాబునా?
ఈ సీమంతపు వేడుకలలో భాగంగా పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఈ సీమంతపు వేడుకలలో యాంకర్ స్రవంతి, అర్జున్ అంబటి, శ్వేతా నాయుడు, యష్మి వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ వేడుకలో అంజలి తన కూతురు భర్త అందరూ ఒకే రంగు ఔట్ ఫిట్ వేసుకొని చాలా అందంగా తయారయ్యారని చెప్పాలి. చాలా సాంప్రదాయ బద్దంగా ఈ సీమంతపు వేడుక జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు చాలా అద్భుతంగా వేడుక జరిగింది అంటూ కామెంట్లు చేయడమే కాకుండా, డెలివరీ కూడా కావడంతో బాబు పుట్టారా? లేదా పాప పుట్టిందా? అని తెలుసుకోవడం కోసం ఆత్రుత కనబరుస్తున్నారు.
?igsh=eGdydXQ1YW1rcHlp
మొగలిరేకులు సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన అంజలి అనంతరం రాధా కళ్యాణం ,దేవత, శివరంజని అనే సీరియల్స్ లో నటించారు. ఇక ఈమె బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. లెజెండ్, ఒక లైలా కోసం వంటి సినిమాలలో నటించిన ఈమె 2017 వ సంవత్సరంలో పవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని బుల్లితెర సీరియల్స్, వెండితెర సినిమాలకు దూరమవుతూ వచ్చారు. ఇక కుమార్తె పుట్టిన తర్వాత నిత్యం తన కూతురితో పెద్ద ఎత్తున ఫోటోషూట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా పలు వ్యాపారాలను కూడా వీరు నిర్వహిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ ను ఘోరంగా చీట్ చేసిన మేనేజర్. .. దారుణంగా కొట్టిందిగా.. వీడియో వైరల్?